‘వర్కటం’కు అభినందనలు
వర్కటం సేవలు అభినందనీయమని బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనిల్‌గౌడ్ అన్నారు
మక్తల్ అర్బన్, నవంబర్ 22 : వర్కటం సేవలు అభినందనీయమని బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనిల్‌గౌడ్ అన్నారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలకు వీజేఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వర్కటం జగన్నాథ్‌రెడ్డి కం ప్యూటర్, ప్రింటర్, స్కానర్ పరికరాలను మంగళవారం అనిల్‌గౌడ్, ఉపాధ్యాయ బృందానికి అందజేశారు.
ఈ సందర్భంగా వర్కటం మాట్లాడుతూ అనిల్‌గౌడ్ ఆన్లైన్లో విద్యార్థుల నమోదు వివరాలు చేయడానికి కంప్యూటర్ కావాలని కోరడంతో పై పరికరాలు అందజేశామని తెలిపారు. తమవంతుగా పరిసర గ్రామాల ప్రజలు సహాయం కావాలని కోరిన వారికి అందజేస్తానన్నారు.
అనంతరం అనిల్‌గౌడ్ మాట్లాడుతూ వీజేఆర్ ఫౌండేషన్ సంస్థ నుంచి స్టడీ మెటీరియల్స్, కంప్యూటర్, ప్రింటర్, స్కానర్ అందజేశారన్నారు. సంస్థ భవిష్యత్తులో ఉత్తమస్థాయికి వెళ్లాలన్నారు. అదేవిధంగా కాళ్లకు చెప్పులు లేకుండా విద్యార్థులు వస్తున్నారని వారికి సహాయం చేయాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

