గార్డెన్ నిర్వహణలో వనపర్తి ఐడీఓసీ ఫస్ట్
జిల్లా ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో హార్టికల్చర్‌శాఖ ఆధ్వర్యంలో 53 రకాలకు చెందిన 50,285 మొక్కలను నాటారు. వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తుండడంతో ఎటు చూసినా పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచుతున్నది. ఈక్రమంలో ఈ నెల 15వ తేదీన హార్టికల్చర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోలింగ్ ట్రోఫీ అవార్డు ను వనపర్తి జిల్లా సొంతం చేసుకున్నది.
- ఆహ్లాదకర వాతావరణంలో కార్యాలయం
- 53 రకాలకు చెందిన 50,284 మొక్కలు గార్డెన్లో ఏర్పాటు
- రోలింగ్ ట్రోఫీ అందుకున్న వనపర్తి జిల్లా..
- హర్షం వ్యక్తం చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, ఏప్రిల్ 18 : జిల్లా ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో హార్టికల్చర్‌శాఖ ఆధ్వర్యంలో 53 రకాలకు చెందిన 50,285 మొక్కలను నాటారు. వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తుండడంతో ఎటు చూసినా పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచుతున్నది. ఈక్రమంలో ఈ నెల 15వ తేదీన హార్టికల్చర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోలింగ్ ట్రోఫీ అవార్డు ను వనపర్తి జిల్లా సొంతం చేసుకున్నది.
ప్రజలకు పాలన మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో జిల్లాలను విభజించారు. ఈక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తో వనపర్తి జిల్లాను ఏర్పాటు చేయగా.. ఎన్నో అభివృద్ధి పనుల్లో రాష్ట్రస్థాయి లో ఇప్పటికే మిగతా జిల్లాలతో పోటీపడి వనపర్తి.. ముందు వరుసలో ఉన్నది.
రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాలో ఐడీఓసీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అయితే వనపర్తిలో ఏర్పాటుచేసిన కార్యాలయం మాత్రం అన్నింటికీ భిన్నంగా గ్రీనరీలో రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. జిల్లా కేంద్రానికి దూరం గా.. చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో రకరకాల మొక్కలు ఏర్పాటు చేయడంతో అక్కడికి వస్తున్న వారికి ఆహ్లాదాన్ని పంచుతున్నది. కార్యాలయం ముందు, వెనుక, చుట్టూ మొక్కలు నాటడంతోపాటు వాటికి నీటిని అందిస్తుండడంతో పచ్చదనం పరుచుకున్నది.
బెస్ట్ గార్డెన్‌గా వనపర్తి ఐడీఓసీ గ్రీనరీ..
రాష్ట్రంలోని ఐడీఓసీ గార్డెన్లలో వనపర్తి జిల్లా కార్యాలయ గ్రీనరీ బెస్ట్‌గా ఎంపిక కావడంపై మంత్రి నిరంజన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ఈనెల 15వ తేదీన (శనివారం రాత్రి) హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్లో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్‌కు రోలింగ్ ట్రోని మంత్రి అందజేశారు.
గార్డెన్‌లోని మొక్కల వివరాలు
హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో మొత్తం 53 రకాలకు సంబంధించి 50,285 మొక్కలను నాటారు. వనపర్తికి కలెక్టర్‌గా తేజస్ నంద్లాల్ పవార్ వచ్చాక ప్రతి శుక్రవారం వాటర్ డేను అమలు చేయడంతోపాటు ప్రతి రోజూ ప్రత్యేక సిబ్బందితో ఈ మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వీటిలో ప్రధానంగా నీడనిచ్చేవి, ఆకర్షణీంగా ఉం డేవి, పూలు పూచే, అలంకార, పచ్చదనాన్ని పంచేవి, ఇండోర్, సువాసనను వెదజల్లేవి, పొద జాతికి చెందినవి, ఆహ్లాదాన్ని పంచేవి, పండ్లనిచ్చే మొక్కలు ఉన్నాయి.
సంతోషంగా ఉంది
రాష్ట్రంలోని అన్ని ఐడీఓసీ కార్యాలయాల గ్రీనరీ విషయంలో వనపర్తి కార్యాలయం ముందు వరుసలో ఉండడంతో రోలింగ్ ట్రోఫీని అందుకోవడం సంతోషంగా ఉంది. మొక్కలను సంరక్షిస్తేనే వాటి నుంచి మనకు ప్రాణవాయువు అందడంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా ఇస్తాయి. ప్రతి శుక్రవారం క్రమంతప్పకుండా వాటర్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మొక్కలు సంరక్షణను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకున్నప్పుపే వనపర్తి.. వనాల వనపర్తిగా మారుతుంది.
– తేజస్ నంద్లాల్ పవార్, కలెక్టర్, వనపర్తి జిల్లా
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

