జాతీయ రహదారికి నెంబర్ కేటాయింపు.. మంత్రి హర్షం
జాతీయ రహదారికి నెంబర్ కేటాయింపు | మహబూబ్నగర్ నుంచి కోస్గి, కొడంగల్, తాండూరు, చించోళి మీదుగా బాపూర్ వరకు ఉన్న రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మారుస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సుమారు 145 కి.మీ. కొత్త జాతీయ రహదారికి 167ఎన్ నెంబర్ను కేటాయిస్తూ కేంద్ర ఉపరితల రవాణ శాఖ గెజిట్ విడుదల చేయడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

మహబూబ్నగర్ : తెలంగాణ రాష్ట్రంలో అన్ని మూలలకు అద్భుతమైన రహదారి వ్యవస్థను కల్పించాలని లక్ష్యంతో సీఎం కేసీఆర్ ధ్యేయంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా అనేక రాష్ట్ర రహదారులను కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జాతీయ రహదారులుగా తీర్చిదిద్దుతున్నారని మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మహబూబ్నగర్ నుంచి కోస్గి, కొడంగల్, తాండూరు, చించోళి మీదుగా బాపూర్ వరకు ఉన్న రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మారుస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయడం వల్లే ఈ జాతీయ రహదారి సాధ్యమైందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
సుమారు 145 కి.మీ. కొత్త జాతీయ రహదారికి 167ఎన్ నెంబర్ను కేటాయిస్తూ కేంద్ర ఉపరితల రవాణ శాఖ గెజిట్ విడుదల చేయడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ హైవే నిర్మాణం పూర్తయితే మహబూబ్ నగర్, కొడంగల్ నియోజకవర్గాల అభివృద్ధికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Five Of A Family Found Dead | తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య
Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఏకంగా రూ.7 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద..!
Sailesh Kolanu | తుఫాను బాధితులకు అండగా శైలేష్ కొలను.. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు, నెటిజన్ల ప్రశంసలు!
ISRO Jobs | ఇస్రోలో 61 టెక్నీషియన్-బి, డ్రైవర్ పోస్టులు.. నవంబర్ 13 చివరితేదీ
‘కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

