మహా ప్రవాహం
జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గడం లేదు. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భా రీ వర్షాలకు కృష్ణమ్మ ఉరకలు వేస్తున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలు ఇప్పటికే నిండుకుండలా మారడంతో వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు.
- జూరాల, టీబీ డ్యాంకు భారీ వరద
- పీజేపీ 46 గేట్ల ద్వారా 2.25 లక్షల క్యూసెక్కులు విడుదల
- తుంగభద్ర డ్యాం 28 గేట్ల ఎత్తివేత
గద్వాల, జూలై 25 : జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గడం లేదు. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భా రీ వర్షాలకు కృష్ణమ్మ ఉరకలు వేస్తున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలు ఇప్పటికే నిండుకుండలా మారడంతో వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. ఎగువ నుంచి 2,27,000 క్యూసెక్కులు జూరాలకు వస్తుండగా గు రువారం 46 గేట్లు ఎత్తి దిగువకు 2,25,354 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జూరా ల ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉ త్పత్తి ముమ్మరంగా కొనసాగుతుంది.
ఎగువన ఐదు యూనిట్లు, దిగువన ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీట ర్లు కాగా ప్రస్తుతం 316.580 మీటర్లుగా ఉన్నది. పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలగానూ ప్రస్తుత నీటి నిల్వ 6.065 ఉన్నది. జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తికి 19,516 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 750, భీమా లిఫ్ట్‌కు-1కు 1300, భీమా లిఫ్ట్-2కు 750, జూరాల ఎడమ కాల్వకు 820, కుడికాల్వకు 453 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
టీబీ డ్యాంకు 96 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
అయిజ, జూలై 25 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు టీబీ డ్యాంకు వరద వచ్చి చేరుతుండడంతో 28 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. గురువారం టీబీ డ్యాంలోకి ఇన్‌ఫ్లో 96,538 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 90,318 క్యూసెక్కులు ఉన్నది. 105.788 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీ బీ డ్యాంలో ప్రస్తుతం పూర్తిస్థాయి నీటి మట్టం 102.576 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. 1633 అ డుగుల నీటి మట్టానికి గానూ ప్రస్తుతం 1632.20 అడుగులు ఉన్నట్లు టీబీ డ్యాం ఎస్ఈ శ్రీకాంత్‌రెడ్డి, సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు. టీబీ డ్యాం నుంచి దిగువకు ఉరకలేస్తూ ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి సుంకేసుల మీదుగా శ్రీశైలం వైపునకు పరుగులు పెడుతున్నది.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు వరద ప్ర వాహం మొదలైంది. ఆనకట్టకు 2,368 క్యూసెక్కు లు ఇన్ ఫ్లో ఉండగా, అవుట్ ఫ్లో 224 క్యూసెక్కుల వరద నీరు సుంకేసుల బ్యారేజీకి చేరుతోందని కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ రాందాస్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 8 అడుగుల మేర నీటి నిల్వ ఉంద ని, ఆర్డీఎస్ నుంచి సుంకేసుల బ్యారేజీకి చేరి అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టు తిరుగు జలాల్లోకి శనివారం చేరుకొనే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు..
కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి ఇన్ ఫ్లో చేరుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 2,04,167 క్యూసెక్కులు చేరుతుండగా, అవుట్ ఫ్లో 2,75,000 ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠస్థాయి నీటి మట్టం 1705 అడుగులకు గానూ ప్రస్తుతం 1695.10 అడుగులు ఉన్నది. పూర్తిస్థాయి నీటి మట్టం 129.72 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 86.08 ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 2,70,000 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 2,70,120 క్యూసెక్కులు ఉంది. గరిష్ఠస్థాయి నీటి మట్టం 1615 అడుగులకు గానూ ప్రస్తుతం 1605. 00 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 37.64 టీఎంసీలకు గానూ 26.584 టీఎంసీలు ఉన్నది.
బోటు ప్రయాణం నిలిపివేత
మక్తల్, జూలై 25 : కృష్ణానదికి ఎగువన ఉన్న మ హారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో కృష్ణానదికి భారీగా వరద వస్తున్నది. దీంతో మక్తల్ మండలం వల్లభాపురం వద్ద కృష్ణమ్మ ఉరకలేస్తున్నది. కృష్ణానది నుంచి ఇప్పటి వరకు 60 టీఎంసీల నీటిని జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేసినట్లు నీటి పారుదలశాఖ అధికారులు తెలిపారు. కృష్ణానది నిండుగా ప్రవహిస్తుండడంతో కృ ష్ణానది అవతలి వైపు ఉన్న దత్తాత్రేయస్వామిని దర్శించుకునేందుకు బోటు ప్రయాణాన్ని అధికారు లు నిలిపివేయడంతో భక్తులు నిరాశతో వెనుదిరిగా రు. నదీతీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
కొనసాగుతున్న పంపింగ్
రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా భీ మా ఫేజ్-1లోని సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్లకు పంపింగ్ కొనసాగుతున్నది. భీమా ఫేజ్-1లోని స్టేజ్ వన్ పంప్ హౌస్ నుంచి 1300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయగా సమాంతర కాల్వ ద్వారా భూత్పూర్ రిజర్వాయర్‌కు 500, తిరుమలాయపల్లి చెరువు నుంచి స్టేజ్-2 ద్వారా సంగంబండ రిజర్వాయర్‌కు 800 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. గురువారం నాటికి సంగంబండ రిజర్వాయర్ 1.88 టీఎంసీలు, భూత్పూర్ రిజర్వాయర్‌లో 0.7 టీఎంసీల నీరు వచ్చి చేరిందని, వీటి నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా 20 క్యూసెక్కుల చొప్పున సాగునీరు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

