మహబూబ్‌నగర్, డిసెంబర్ 15 : మహబూబ్‌నగర్‌కు అదనపు కలెక్టర్‌గా శివేందర్ప్రతాప్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం డీఆర్డీవో పీడీ యాదయ్య స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శివేందర్ప్రతాప్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహించనున్నారు. డీఆర్డీవో జిల్లా అధికారిగా యాదయ్య యథావిధిగా విధులు నిర్వహించనున్నారు.
వనపర్తి, డిసెంబర్ 15: జిల్లాకు మరోఅదనపు లోకల్ బాడీ కలెక్టర్‌గా సంచిత్ గంగ్వార్ బాధ్యతలు అప్పగించినట్లు జిల్లా ఉన్నత అధికారుల సమాచారం. 2021 బ్యాచ్ ఐఏఎస్ కు చెందిన గాంగ్వార్‌ను వనపర్తి జిల్లాకు అదనపు లోకల్ బాడీ కలెక్టర్‌గా నియమితులయ్యారు.