మందులన్నీ బయటకే..
సర్కారు వైద్యం కో సం నిరుపేదలు, మధ్య త రగతి కుటుంబాలే అధికంగా ఆధారపడతారు. ఈ క్రమంలో ప్రభుత్వ దవాఖానకు వచ్చిన వారికి మందులు.. సూదులు బయట తెచ్చుకోండంటూ చీటీలు (ప్రిస్క్రిప్షన్) రాస్తుండడంతో సర్కారు దవాఖానల్లో నిరుపేదలకు ఆశించిన వైద్యం అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
- సూదులు, గోలీల కోసం రోగుల అవస్థలు
- బయట ఉన్న మెడికల్ దుకాణాలకు రాస్తున్న వైద్యులు
- బడ్జెట్ విడుదలకు సర్కారు బ్రేకులు
వనపర్తి, జూలై 15 (నమస్తే తెలంగాణ) : సర్కారు వైద్యం కో సం నిరుపేదలు, మధ్య త రగతి కుటుంబాలే అధికంగా ఆధారపడతారు. ఈ క్రమంలో ప్రభుత్వ దవాఖానకు వచ్చిన వారికి మందులు.. సూదులు బయట తెచ్చుకోండంటూ చీటీలు (ప్రిస్క్రిప్షన్) రాస్తుండడంతో సర్కారు దవాఖానల్లో నిరుపేదలకు ఆశించిన వైద్యం అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అనారోగ్యంతో వచ్చిన వారికి ఉపశపనం కలుగకపోగా, మరింత ఆర్థికభారం పడుతున్నది. దాదాపు 8నెలలుగా సర్కా రు దవాఖానకు మందులు, సూదుల కోసం రావాల్సిన నిధులన్నీ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ప్రస్తుత సీజన్లో మరిన్ని సమస్య లు ఎదురవుతున్నా యి.
ప్రతి రోజూ 800 మంది పేషెంట్లు..
జిల్లా దవాఖానకు అన్ని వార్డులకు సంబంధిం చి దాదాపు 500 నుంచి 800 మంది వరకు పే షెంట్లు వస్తున్నారు. 450 పడకలతో నడుస్తున్న ఈ దవాఖానకు రోగుల తాకిడి తీవ్రంగానే ఉన్నది. చిన్నారులు, పెద్దలతోపాటు ఆర్థోపెడిక్, డెంటిస్ట్, ఈఎన్టీ తదితర విభాగాల వారీగా జిల్లాలోని నలుమూలల నుంచి పేషెంట్లు వస్తున్నారు. ప్రస్తు తం వర్షాకాలం సీజన్ ఉండడంతో మరింత మం ది పెరుగుతున్నారు. ప్రజలు సాధారణ జ్వరాలతోపాటు మలేరియా, డెంగీ తదితర రోగాల బారి న పడుతున్నారు. వర్షాలు మరింత పెరిగితే.. రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది.
పెండింగ్లో నిధులు..
జిల్లా దవాఖానకు దాదాపు నాలుగు క్వార్టర్లకు సంబంధించిన బడ్జెట్ రాలే దు. మందుల సరఫరాలోనూ కోత విధిస్తూ ఎన్ని దఫాలు అడిగినా.. నోస్టాక్ అన్నట్లుగా కొన్ని మందు ల పరిస్థితి ఉన్నది. దాదాపు ఆరు నెలలుగా ప్రాధాన్యతగల మందులకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. గత మార్చిలో డ్ర గ్స్ కోసం ఒక క్వార్టర్కు సంబంధించి రూ.12.50 లక్షలు మాత్రమే వచ్చా యి. ఇంకా మూడు క్వార్టర్లకు పైగా ని ధులు పెండింగ్లోనే ఉన్నాయి. దీంతో మందులు కొనుగోలు చేయలేక, రోగులను బయటకు పంపిస్తున్నారు. ఇదిలా ఉంటే సర్జికల్ మందుల పరిస్థితి మరింత ఘోరంగా ఉన్నది. విభాగాల వారీగా కేటాయించిన ప్రకారం బడ్జెట్ విడుదల చేయాల్సి ఉన్నది.
మందులు అందుబాటులో ఉంచుతాం
దవాఖానలో అధిక శాతం మందులు, సూదులు ఉన్నాయి. కొన్ని మాత్రమే కొంత కాలం నుంచి రావడం లేదు. వాటిని తెప్పించే ప్రయత్నం చేస్తాం. రోగులకు ఇబ్బందులు లేకుండా అన్ని అందుబాటులో ఉంచుతాం. కొన్ని సందర్భాల్లో లేకుంటే ప్రత్యామ్నాయ మందులను ఇస్తున్నాం. ప్రతి క్వార్టర్ బడ్జెట్ విడుదల, పెండింగ్లకు సంబంధించి ఆ బాధ్యతలను నిర్వహించే సూపరింటెండెంట్ సెలవులో ఉన్నారు.
– డాక్టర్ రవిశంకర్, ఆర్ఎంవో, జిల్లా దవాఖాన, వనపర్తి
బయట తీసుకోమన్నారు..
నరాలు గుంజుతున్నాయని పాన్గ ల్ నుంచి పెద్ద దవాఖానకు వచ్చినా.. వైద్యులు పరీక్షించి మందులు మాత్రం బయటనే తీసుకోమన్నరు. దవాఖానలో అన్ని ఉంటాయని సర్కారు చెబుతుం ది. వీల్లేమో బయట తెచ్చకోమంటరు. మా కు అర్థం కావడం లేదు. అంతదూరం నుం చి వస్తే.. కనీసం ఒక్క గోళి కూడా ఇవ్వకుం డా అన్నీ బయటే తెచ్చుకోమంటున్నారు.
– బాలమ్మ, పాన్గల్, వనపర్తి జిల్లా
ఆయింట్మెంట్ లేదంట..
మోకాళ్ల నొప్పులున్నాయని దవాఖాన కు వస్తే వైద్యులు చూసినరు.. మందులు బయట తెచ్చుకోమన్నరు. ఇంత పెద్ద దవఖానలో ఆయింట్మెంట్ కూడా లేదంట.. షాప్లో తీసుకో అన్నరు. డబ్బులు లేవని సర్కారు దవాఖానకు వస్తే ఇలా చేస్తే మేం ఎవరికి చెప్పాలే. ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటిలా ఉంది.
– నాగమ్మ, వృద్ధురాలు, గాంధీనగర్, వనపర్తి
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

