శుభగడియలు షురూ
హిందువుల పండుగలకు శ్రావణ మాసం స్వాగత తోరణంలాంటిది. ఈ ఏడాది కూడా జూలై 29న శ్రావణ శుక్ల పాఢ్యమి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానున్నది. ఈ మాసంలో పలు పండుగలు ఉన్నాయి. శుక్రవారంతో ఈ మాసం ఆరంభమవుతుండడం విశేషం. ఈ మాసాన్ని పవిత్రంగా భావిస్తారు. పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణా నక్షత్రంలో ఉండడం, మహా విష్ణువు జన్మ నక్షత్రం కావడం వల్ల ఈ మాసానికి పేరు వచ్చిందని పండితులు పేర్కొంటున్నారు
- రేపటి నుంచి శ్రావణ మాసం
- పండుగల మాసం ప్రారంభం
- ఆగస్టు 2న నాగుల పంచమి..
- 5న వరలక్ష్మీ వ్రతం
- 12న రాఖీ పౌర్ణమి
రేపటి నుంచి శుభగడియలు షురూ కానున్నాయి. నెల రోజుల పాటు హిందువులు ముఖ్యంగా మహిళలు అత్యంత పవిత్రంగా జరుపుకొనే శ్రావణ మాసం ఈనెల 29నుంచి ప్రారంభం కానున్నది. పెండ్లిళ్లు, గృహప్రవేశాల్లాంటి శుభకార్యాలతోపాటు పండుగలను తీసుకొచ్చే మాసం కావడంతో ప్రతి ఇంట్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనున్నది.

నాగర్కర్నూల్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : T. ఈ సందర్భంగా ప్రతి ఇల్లు పూజలతో, శివనామస్మరణతో మార్మోగుతుంది. ఈ మాసంలో చేసే పూజలకు దైవ శక్తి ఉంటుందని అందుకే ఈ నెలలో పూజలు, వ్రతాలకు గొప్ప ఫలితాలు లభిస్తాయని నమ్మకం. వర్ష రుతువు కూడా ఈ మాసంలోనే మొదలవుతుంది. ఈ మాసంలో దసరా, దీపావళి, సంక్రాంతిలాంటి గొప్ప పండుగలకు ముందుగా ఇతర పండుగలను తీసుకొస్తుంది. నాగుల పంచమి, వరలక్ష్మి అమావాస్య, పొలాల అమావాస్య, సంకష్ట హరచతుర్థి, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పండుగలు ఈ మాసంలోనే వస్తున్నాయి. శుక్రవారాలకు అత్యంత పవిత్రత ఉంటుంది.
ఈసారి జూలై 29న తొలి శుక్రవారంతో శ్రావణ మాసం ప్రారంభమవుతుండడం చాలా గొప్పదిగా భావిస్తున్నారు. ఇలా ఆగస్టు 5, 12, 19, 26వ తేదీలతో కలిపి ఐదు శ్రావణ శుక్రవారాలు పవిత్రమైన రోజులుగా నిలుస్తాయి. ఆగస్టు 5న వరలక్ష్మీ వ్రతం కూడా ఉంటుంది. ఈ రోజు వ్రతం చేసుకోలేని భక్తులు 12వ తేదీన లేదా ఏ శుక్రవారమైనా చేసుకోవచ్చు. ఇక పెండ్లిళ్లు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు వంటి కా ర్యాలకూ ఈ మాసం పెట్టింది పేరు. చాలా మంది ఇండ్ల నిర్మాణాలు చేసుకోవడానికి ఎదురుచూస్తున్నారు. అలాగే తమ పిల్లల కు పెండ్లిళ్లు చేసేందుకు తల్లిదండ్రులు సైతం శ్రావణ మాసం కో సం సిద్ధంగా ఉన్నారు. ఈ మాసం శాస్ర్తోక్తంగా, సంప్రదాయకంగా హిందువులకు ఆధ్యాత్మికంగా నిలువనున్నది. ఈ మాసం లో భాగంగా జూలై 31, ఆగస్టు 3, 4, 5, 7, 10, 11, 12, 13, 17, 20, 21 తేదీలు పెండ్లిళ్లు, ఇతర శుభాకార్యాలకు మంచి రోజులుగా నిర్ణయించారు. కాగా, ఈ కార్యాలతో బ్రాహ్మణ పండితులకు తీరికలేకుండా చేయడంతోపాటు ఫంక్షన్ హాళ్లు, భవన నిర్మాణ కార్మికులు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు చేసే డెకరేషన్, సౌండ్ సిస్టం, టెంట్హౌజ్లు, నాయీ బ్రాహ్మణులు, బ్యూటీషియన్లు, వంట మనుషులువంటి ఎంతో మందికి ఉపాధిని సైతం కల్పించనున్నది. చాలా మంది మహిళలు ఈ మాసంలో మాంసాహారానికి దూరంగా ఉంటారు. కేవలం శాఖాహారం, దేవాలయాల సందర్శన, పూజలు, వ్రతాలతో ఆధ్యాత్మికత భావనలతో నిండి ఉంటారు. అలాంటి పవిత్రమైన ఆధ్యాత్మిక, పండుగల మాసం శ్రావణ మాసం రావడంతో హిందువుల్లో భక్తి భా వం అల్లుకోనున్నది. అలాంటి ఈ మాసం ఆగస్టు 27న శనివారం అమావాస్యతో ముగుస్తుంది. దీనితోపాటే శుభకార్యాలూ, పెళ్లిళ్లూ ఆగిపోతాయి. దాదాపు నాలుగు నెలలపాటు మంచి రోజులు ఉండవు. తిరిగి డిసెంబర్ చివరి వారంలో శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి.
మహిళలకు పవిత్రమాసం..
శ్రావణ మాసం హిందువులకు పవిత్రం, ఆధ్యాత్మికమైంది. ఈ మాసంలోనే రాఖీపౌర్ణమి, నాగుల పంచమి, వరలక్ష్మివ్రతాలు వస్తాయి. మహిళలకు అత్యంత పూజనీయమైన మాసంగా నిలుస్తుంది. పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణం, ప్రవేశాల్లాంటి శుభకార్యాలకు మంచి మాసం. ఈ మాసంలో పవిత్రత వల్ల చేసే పనులకు చాలా శుభం జరుగుతుంది. ఈ మాసం తర్వాత డిసెంబర్ చివరి వారంలోనే పెళ్లిళ్లకు మంచి రోజులు వస్తాయి.
– దుర్గి శ్రీకాంత్ శర్మ, పూజారి
శ్రావణ మాసంలో పండుగలు..
- ఆగస్టు 2న నాగుల పంచమి, గరుడ పంచమి.
- 3న స్కంద షష్టి : సుబ్రహ్మణ్య స్వామికి పూజలు.
- 5న వరమహాలక్ష్మీ వ్రతం, దుర్గాష్టమి వ్రతాలు.
- 7న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు, స్నేహితుల దినోత్సవం.
- 8న శ్రావణ పుత్రద ఏకాదశి.
- 9న ప్రదోష వ్రతం.
- 11న సత్యనారాయణస్వామి పూజ.
- 12న పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, రాఘవేంద్రస్వామి ఆరాధన, వరలక్ష్మీ వ్రతాలు.
- 15న సంకష్ట హర చతుర్థి.
- 19న శ్రీకృష్ణ జన్మాష్టమి.
- 27న పొలాల అమావాస్య.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

