Tension | దామరగిద్దలో ఉద్రిక్తత.. అధికారులను అడ్డుకున్న రైతులు.. సొమ్మసిల్లిన మహిళా రైతు
Tension | నారాయణపేట జిల్లా కొడంగల్-నారాయణపేట ఎత్తి పోతలపథకంలో భూములు కోల్పోతున్న రైతులు అధికారులపై తిరగబడ్డారు .
దామరగిద్ద : నారాయణపేట(Narayanapeta) జిల్లా కొడంగల్-నారాయణపేట ఎత్తి పోతల( Lift Irrigation) పథకంలో భూములు కోల్పోతున్న రైతులు అధికారులపై తిరగబడ్డారు( Farmers Protest) . దీంతో ఉద్రిక్త పరిస్థితులు ( Tensions ) ఏర్పడ్డాయి. తోపులాటలో మహిళా రైతు సొమ్మసిల్లిపోవడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు సర్వే చేయడానికి అధికారులు రావడంతో రైతులంతా ఏకమై అధికారులను అడ్డుకున్నారు.

విషయం తెలుసుకున్న పైఅధికారులు వందల మంది పోలీసులను అక్కడికి పంపించడంతో పోలీసులకు ( Police ) వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. బాపనగుట్ట రైతులతో పాటు మహిళ రైతులు కూడా వచ్చి రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ సమయంలో గ్రామంలో మల్లమ్మ అనే మహిళ రైతు స్పృహతప్పి పడిపోవడంతో ఆమెను ప్రథమ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. భీమప్ప అనే రైతు సర్వే కోసం వచ్చిన అధికారి కాళ్లు మొక్కుతా సార్.. మాకు చాలినంత డబ్బులు ఇస్తామని చెప్పిన తర్వాతనే సర్వే చేయాలని కాళ్లపై పడి వేడుకున్నాడు.

ఉదయం 6 గంటలకు ప్రారంభమైన రాస్తారోకో పది గంటల వరకు కొనసాగడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అక్కడికి వచ్చిన అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చెప్పిన విధానం ప్రకారమే చేస్తున్నామని ఇప్పటికే డబ్బులు వచ్చిన రైతులకు కూడా ప్రభుత్వం పెంచి ఇస్తే అది కూడా మిగతా రైతులు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. మాజీ సర్పంచ్ మోగులప్ప మాట్లాడుతూ రైతుకు సరైన ధర నిర్ణయించిన తరువాతనే సర్వే చేపట్టాలని కోరడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

