Alampur | కళ్ళ ముందే కాలిన మొక్కజొన్న పంట.. కన్నీరు పెట్టుకున్న రైతన్న
Alampur | ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే కాలి పోతున్న దృశ్యాన్ని చూసి రైతు కంట కన్నీళ్లు ఆగలేదు.
Alampur | అలంపూర్, ఏప్రిల్ 15 : ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే కాలి పోతున్న దృశ్యాన్ని చూసి రైతు కంట కన్నీళ్లు ఆగలేదు. వివరాల్లోకి వెళితే ఉండవెల్లి మండలం కంచిపాడు గ్రామానికి చెందిన అచ్చన్న అనే రైతు నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పంట చేతికి అందడంతో మొక్కజొన్న కంకులను కోసి, వాటిని పొలంలోనే కుప్పగా పోసి నూర్పిడి చేసేందుకు నిలువ ఉంచాడు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో పొలంలోని నాలుగు ఎకరాల మొక్కజొన్న పంట సుమారు 40 క్వింటాళ్ల ధాన్యం కాలి బూడిదైపోయింది. ఉదయాన్నే పొలం వైపు వెళ్లి చూడగా పంట పూర్తిగా మట్టిలో కలిసిపోయింది.. అప్పటికే మొక్కజొన్న కంకులు కాలుతూనే ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూసి రైతు లబోదిబో అంటూ గుండె బాదుకున్నాడు. బాధిత రైతును ఆదుకోవాలని తోటి రైతులు ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

