మల్దకల్, మార్చి 12 : మండలంలోని విఠలాపు రం జెడ్పీహెచ్ఎస్లో గణితం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటేశ్‌ను అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్ సస్పెండ్ చేసినట్లు హెచ్ఎం రాజేందర్‌కుమార్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. వెంకటేశ్ పాఠశాల వి ద్యార్థినులతో అసభ్యకరంగా వ్యవహరించడంతో మల్దకల్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ సోమవారం రాత్రి ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు