భౌభౌ.. బాబోయ్!
మండలంలో వీధి కుక్కల సంచారం ఎక్కువైంది. రాత్రి, పగలు తేడా లేకుండా తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో గ్రామంలో దాదాపుగా 100 కుక్కలు ఉన్నాయి.
- గ్రామాలు, పట్టణాల్లో పెరిగిన వీధి కుక్కలు
- రోడ్లపై గుంపులు.. గుంపులుగా సంచారం
- కొన్ని చోట్ల గొర్రెలు, మేకలపై దాడులు
- భయాందోళనల్లో ఉమ్మడి జిల్లా ప్రజలు
హన్వాడ, ఫిబ్రవరి 24 : మండలంలో వీధి కుక్కల సంచారం ఎక్కువైంది. రాత్రి, పగలు తేడా లేకుండా తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో గ్రామంలో దాదాపుగా 100 కుక్కలు ఉన్నాయి. చాలా గ్రామాల్లో మూగజీవాలు, కోళ్లు, మేకపిల్లలను చంపి తింటున్నాయి. అంతేకాకుండా చాలా మంది కుక్కకాటుకు గురవుతున్నారు. రాత్రివేళల్లో అరుస్తుండడంతో నిద్రపట్టని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆరుబయట ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారులను ఏం చేస్తాయో అనే భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. రోడ్లపై తిరుగుతున్న, వాహనాలపై వెళ్తున్న వారిని వెంబడిస్తున్నాయి. గ్రామాల్లో కుక్కలు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవావల్సిన అవసరం ఉన్నది. మండలంలో ఈ ఏడాది జనవరిలో 40, ఫిబ్రవరిలో 27 మంది కుక్కకాటుకు గురయ్యారు. చిన్నదర్పల్లి, హన్వాడ, పిల్లిగుండు సమీపంలోని కల్వర్టుల వద్ద కోళ్ల వ్యర్థాలు, పశువుల కళేబరాలను వేయడంతో వాటిని తింటున్న కుక్కలు వాహనదారులపైకి వస్తున్నాయి. రోడ్డు పక్కన వ్యర్థాలు పారబోయొద్దని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.
మూగజీవాలను చంపుతున్నాయి..
ఎవరూ లేని సమయంలో కుక్కలు మూగజీవాలను చంపి దూరం తీసుకెళ్లి తింటున్నాయి. అలాగే రోడ్లపైకి వెళ్లిన వారిని కరుస్తున్నాయి. పలువురు హన్వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేసుకున్నారు. అధికారులు గ్రామాల్లో కుక్కలు లేకుండా చర్యలు తీసుకోవాలి. కుక్కలకు సంతానోత్పత్తి కలగకుండా చూడాలి. ఈ విషయాలపై అధికారులు చాలాసార్లు ఫిర్యాదు చేశాం.
– బాలరాజు, చిన్నదర్పల్లి, హన్వాడ మండలం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
ప్రజలు కుక్కలతో అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా కుక్కకాటుకు గురయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావాలి. కుక్కకాటు మందు అందుబాటులో ఉన్నది. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లొద్దు. ప్రతి రోజూ రెండు నుంచి మూడు కుక్కకాటు కేసులు వస్తున్నాయి. ప్రధానంగా హన్వాడ, చిన్నదర్పల్లి, పిల్లిగుండు గ్రామాల సమీపంలో రోడ్డు పక్కన వ్యర్థాలు వేస్తున్నారు. దీంతో కుక్కకాటు కేసులు ఎక్కువవుతున్నాయి.
– ప్రగతి, మండల వైద్యాధికారిణి, హన్వాడ
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

