ఆన్లైన్ పద్ధతిలోనే ఇసుక రవాణా జరగాలి
నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఇసుక రీచ్‌ల నుంచి ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా మాత్రమే మన ఇసుక-మన వాహ నం ఆన్లైన్ పద్ధతిలోనే ఇసుక రవాణా జరగాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు.
- అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు
- కలెక్టర్ బాదావత్ సంతోష్
ఉప్పునుంతల, ఏప్రిల్ 7: నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఇసుక రీచ్‌ల నుంచి ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా మాత్రమే మన ఇసుక-మన వాహ నం ఆన్లైన్ పద్ధతిలోనే ఇసుక రవాణా జరగాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. మంగళవారం ఉప్పునుంతల మండలంలోని మొల్గర, పెద్దాపూర్ గ్రామాల్లో కొనసాగుతున్న ఇసుక రీచ్‌లను అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇ సుక తవ్వకం, తరలింపు విధానాలను పరిశీలించి సంబంధిత అధికారులతోపాటు ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసు కున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక రవాణా పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే జరగాలని, ప్రతి వాహనం ఎక్కడి నుంచి ఎక్కడికి ఇసుక తరలిస్తున్నది, స్పష్టంగా నమోదు కావాలని, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలని, రాత్రి వేళలో తాను సీసీ కెమెరాల్లో రికార్డు పరిశీలిస్తానన్నారు. ఆన్లైన్ అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుక తవ్వకాలు లేదా రవాణా చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. అధికారులే నియమాలు ఉల్లంఘించినా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మన ఇసుక-మన వాహనం పోర్టర్లో నమోదు చేసుకున్న వాహనాలకు మాత్రమే ఇసుక రవాణా అనుమతులు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.ప్రతి దశలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని,ప్రజలకు అవసరమైన ఇసుక సులభంగా అందుబాటులోకి రావడంతో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయన్నారు. కలెక్టర్ వెంట ఎస్సై వెంకట్‌రెడ్డి, తాసీల్దార్ సునీత, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

