ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దంటూ..
రైతులకు హాని చేసే ఇథనాల్ ఫ్యాక్టరీ ని ర్మాణాన్ని కొన్ని నెలలుగా అడ్డుకుంటూనే ఉన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, పాలక ప్రభుత్వ పెద్దలు హామీలతో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం అగిపోయిందనుకున్న పెద్ద ధన్వాడ గ్రామ ప్రజలతోపాటు 12 గ్రామాల ప్రజలకు ఆ కంపెనీ యాజమన్యం పెద్ద షాక్ ఇచ్చింది.
- పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించిన యాజమాన్యం
- రాత్రికి రాత్రే కంటైనర్లు, ్రప్రైవేట్ సిబ్బందిని దింపిన వైనం
- పనులు నిలిపివేయాలని రైతుల డిమాండ్
రాజోళి, జూన్ 3 : రైతులకు హాని చేసే ఇథనాల్ ఫ్యాక్టరీ ని ర్మాణాన్ని కొన్ని నెలలుగా అడ్డుకుంటూనే ఉన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, పాలక ప్రభుత్వ పెద్దలు హామీలతో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం అగిపోయిందనుకున్న పెద్ద ధన్వాడ గ్రామ ప్రజలతోపాటు 12 గ్రామాల ప్రజలకు ఆ కంపెనీ యాజమన్యం పెద్ద షాక్ ఇచ్చింది. సోమవారం అర్ధరాత్రి గ్రామస్తులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా కంటైనర్, జేసీబీలను, కొంతమంది ప్రైవేట్ సిబ్బందిని ఆ కంపెనీ యా జమాన్యం దింపింది.
మంగళవారం ఉదయం కొంతమంది రైతులు అటుగా వెళ్తు వాటిని గమనించి చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు సమాచారం ఇచ్చి ఫ్యాక్టరీ నిర్మాణం చెపట్టే రాహదారిలో బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలానికి చెందిన రైతులు ముక్తకంఠంతో ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశామన్నారు.
నెలరోజులు నిరాహార దీక్షలు చేసి రైతులకు అండగా ప్రభుత్వం, అధికారులు నిలవాలని కోరినా పాలక ప్రభుత్వం అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ హామీతో దీక్షలు విరమించామని ఇప్పుడు ఫ్యా క్టరీ యాజయాన్యం చెప్పాపెట్టాకుండా పనులు ప్రారంభించేందుకు పూనుకోవడం మంచిది కాదన్నారు. ఇప్పటి వరకు ఫ్యాక్టరీపై శాంతియుతంగానే నిరసనలు చేశామని రైతుల సహనాన్ని పరీక్షిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.
గ్రామంలో కొంత మంది రైతులు పాలక ప్రభు త్వ పెద్దలతో చేతులు కలిపి ఫ్యాక్టరీ ఏర్పాటుకు సహకరిస్తూ రైతుల కడుపుకొడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపైకి మంది మార్బాలం ఉందని గుండాలను దింపినా ఉద్యమాలు ఆగవని పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, కాంగ్రెస్ పెద్దలు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రజలకు అండ గా నిలవని నాయకులకు తగి న రీతిలో బుద్ధిచెబుతామని హెచ్చరించారు.
అయితే రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నా ఎ వరూ స్పందించకపోవడంతో ఇథనా ల్ ఫ్యా క్టరీ రద్దు కోసం భవిష్యత్‌లో పెద్ద ఎత్తున ఆం దోళనలు నిర్వహిస్తామని, త్వర లో దీనికి సం బంధించిన కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పి రైతులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

