Polytechnic students | పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా
Polytechnic students | పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం లోని పాలిటెక్నిక్ కళాశాల ఎదుట పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు.
వడ్డేపల్లి : పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం లోని పాలిటెక్నిక్ ( Polytechnic students ) కళాశాల ఎదుట పీడీఎస్‌యూ (PDSU) ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు హలీం పాషా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.97 కారణంగా రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు.
పాలిటెక్నిక్ కళాశాలలను కొత్తగా ఏర్పాటు చేసిన శక్తి ( SHAKTI ) వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడం, వాటిని యంగ్ ఇండియా స్కిల్‌తో అనుసంధానం చేయడం వల్ల డిప్లొమా విద్య భవిష్యత్తుపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయని అన్నారు. పాలిటెక్నిక్ విద్య అనేది సాధారణ స్కిల్ ట్రైనింగ్ కోర్సు కాదని, ఇది ప్రత్యేకమైన టెక్నికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థ అని వెల్లడించారు.
మూడు సంవత్సరాల డిప్లొమా విద్య ద్వారా విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడంతో పాటు ఉద్యోగ అవకాశాలను కూడా పొందుతున్నారని తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలను ప్రస్తుత టెక్నికల్ ఎడ్యూకేషన్ డిపార్టుమెంట్ పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు వెంకటేష్, దానయ్య, చార్లెస్ ముదిరాజ్, పృద్వి, వీరేష్, వికాస్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు .
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

