సమయపాలన గాలికి.. ఇష్టారాజ్యంగా విధుల నిర్వహణ! ప్రజలకు తప్పని నిరీక్షణ
ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన తప్పనిసరి అని పాలకులు, ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ మాటలు అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మాగనూరు నవంబర్ 20: ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన తప్పనిసరి అని పాలకులు, ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ మాటలు అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాగనూరు మండల కేంద్రంలోని మహిళా సమైక్య కార్యాలయంలో గురువారం ఉదయం 11:30 గంటలు దాటినా అధికారి, సిబ్బంది విధులకు హాజరుకాకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది.
కార్యాలయంలో కంప్యూటర్లు, ఇతర కార్యాలయ సామగ్రి సిద్ధంగా ఉన్నప్పటికీ సిబ్బంది మాత్రం కనిపించకపోవడం గమనార్హం. విధులకు హాజరయ్యే సమయంపై బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం ఇష్టానుసారంగా విధుల నిర్వహణ సాగుతున్నా సంబంధిత జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు తమ పనుల కోసం అధికారుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడితే బాధ్యత ఎవరిది? సిబ్బంది సమయపాలన పాటించకపోతే ప్రశ్నించే అధికారులు ఎక్కడ? కార్యాలయ నిర్వహణపై జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారా? అన్న ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.
ప్రజలకు సేవలు అందించాల్సిన కార్యాలయాల్లోనే సమయపాలన లోపిస్తే పాలన ఎలా సాగుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళా సమైక్య కార్యాలయ సిబ్బంది విధులకు సకాలంలో హాజరయ్యేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవడంతో పాటు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై పర్యవేక్షణ, బాధ్యత నిర్ధారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mysaa | 29 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన వందేమాతరం – సుద్దాల.. ‘మైసా’ నుంచి పవర్ఫుల్ విప్లవ గీతం నేడే!
IND vs NZ | కివీస్‌కు దీటుగా జవాబిస్తున్న టీమిండియా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి స్కోర్ ఎంతంటే..
NHRC | తెలంగాణలో ప్రభుత్వ దవాఖానల దుస్థితిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్
Vishwambhara | ఎట్టకేలకు ఊపందుకున్న మెగాస్టార్ ‘విశ్వంభర’.. ట్రైలర్ రెడీ, రిలీజ్ డేట్ ఎప్పుడో?
లిఫ్ట్ అడిగి ఫోన్ దొంగలించేందుకు యత్నం.. యువకుడి గొంతు కోసిన దుండగుడు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

