Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Singireddy Niranjanreddy | మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నా. మంత్రి కృష్ణారావు వెటకారపు వ్యాఖ్యలు మానుకుని, రైతులకు నీళ్లెలా అందించాలనే దానిపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హితవు పలికారు.
Singireddy Niranjanreddy | నాగర్ కర్నూల్ జిల్లాలోని కుడికిళ్ల సమీపంలో అడ్డంకిగా ఉన్న తుండు కట్టను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. నీళ్లు ఇక్కడిదాకా వచ్చి ఆగినయి. ఈ తండు తీసేస్తే నీళ్లు పోతయి.. ఎన్ని రోజుల్లో పోతయని మీకు సందేహాలుంటే ఎస్టిమేట్ చేయించి మాకివ్వండి.. రేపు ఎస్టిమేట్ మొదలుపెట్టండి. మీరు రండి.. అందరం కలిసి మిషన్లు పెట్టి ఈ తండు పని చేసేద్దాం. ఈమాత్రం పని చేయడానికి మీకు చేతకాదా..? మరి మూడున్నరేండ్లలో కేసీఆర్ ఎట్లా చేసిండన్నారు.
70 టీఎంసీల సామర్థ్యం ఉండే 5 రిజర్వాయర్లు కట్టిండు. 27వేల ఎకరాల భూసేకరణ చేసిండు. రూ.35 వేల కోట్లు ఖర్చు పెట్టి సర్జ్‌పూల్స్, పంప్‌హౌస్‌లు, మోటార్లు, కరెంట్ లైన్లు మొత్తం పూర్తి చేసిండన్నారు. 31 కిలోమీటర్ల ట్విన్ టన్నెల్స్ తవ్వించిండన్నారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాకపోతే మాకు అప్పగించాలని.. ఒకవేళ నీళ్లు తరలించకపోతే నాలుక కోసుకొని ఇంకోసారి నీళ్ల గురించి మాట్లాడనన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నా. సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని, రెండు పంపుల సామర్థ్యానికి సరిపడా కట్టను తొలగిస్తే గ్రావిటీ ద్వారా ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్లకు నీటిని తరలించవచ్చు. మంత్రి కృష్ణారావు వెటకారపు వ్యాఖ్యలు మానుకుని, రైతులకు నీళ్లెలా అందించాలనే దానిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం
కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాకపోతే మాకు అప్పగించండి
ఒకవేళ నీళ్లు తరలించకపోతే నాలుక కోసుకొని ఇంకోసారి నీళ్ల గురించి మాట్లాడను
మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నా
సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని, రెండు పంపుల సామర్థ్యానికి సరిపడా కట్టను తొలగిస్తే గ్రావిటీ ద్వారా ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్లకు నీటిని తరలించవచ్చు
మంత్రి కృష్ణారావు వెటకారపు వ్యాఖ్యలు మానుకుని, రైతులకు నీళ్లెలా అందించాలనే దానిపై దృష్టి పెట్టాలి
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
కుడికిళ్ల సమీపంలో అడ్డంకిగా ఉన్న తుండు కట్టను పరిశీలించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) October 22, 2026


Read Also :
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
France Protests | ఫ్రాన్స్‌లో నిరసనలు.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
సింగరేణి సమస్యలపై కేటీఆర్‌తో ఎంపీ రవిచంద్ర చర్చ
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

