కొల్లాపూర్: పేదలకు వరం సీఎంఆర్ఎఫ్ అని ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 15వార్డు చౌటబట్ల గ్రామానికి చెందిన కాశన్న మోకాళ్ల నొప్పులతో బాధ పడుతూ ఆపరేషన్ చేసుకునే ఆర్థిక స్థోమత లేక ఎమ్మెల్యే బీరంను సంప్రదించి తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2లక్షలు మంజూరు చేయించారు.
అట్టి ఎల్వోసీని బాధితుడు కాశన్నకు బుధవారం ఎమ్మెల్యే హైదరాబాద్‌లోని తన నివాసంలో అందజేశారు. ఈ సందర్భం గా బాధితుడు కాశన్న కుటుంబీకులు సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్యే బీరంకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో 15వార్డు కౌన్సిలర్ పొడెండ్ల సత్యంయాదవ్, టీఆర్ఎస్ నాయకులు చాకలి ఆంజనేయులు తదితరులు ఉన్నారు.