పెద్దకొత్తపల్లి: మండల పరిధిలోని చంద్రబండ తండాకు చెందిన వార్డు సభ్యుడు జర్పుల దేవీకృష్ణ నాయక్‌తో పాటు పలు వురు గ్రామస్తులు సర్పంచ్ రాందాస్ సమక్షంలో బుధవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పార్టీ కం డువాలను వేసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో దేశం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. పేదల పెన్నిధి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఆదర్శంగా తీసుకున్నాయంటే గర్వకారణమన్నారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండ ల నాయకులు గణేశ్‌రావు, రాజు, వేముల నాయక్, నరేశ్ నాయక్, మోహన్‌నాయక్ తదితరులు ఉన్నారు.