వారం రోజులుగా నిలిచిన మిషన్ భగీరథ నీరు
మద్దూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో గత ఏడు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని రెణివట్ల, చెన్నారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళలు వాపోతున్నారు.
- ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- పట్టించుకోని అధికారులు
మద్దూర్, జనవరి 23 : మద్దూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో గత ఏడు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని రెణివట్ల, చెన్నారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళలు వాపోతున్నారు. అయితే రెణివట్ల గ్రామాన్ని ఇటీవల మద్దూరు మున్సిపాలిటీలో విలీనం చేయడంతో గ్రామస్తులు తమ సమస్యలను ఎవరు చెప్పుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు మాత్రం మూడు రోజులు పైప్లైన్ మరమ్మతులు ఉన్నాయని నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించి మూడు రోజులు గడిచి వారం రోజులు అవుతున్నా నీటి సరఫరాపై నోరుమెదపడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారానైనా నీటిని సరఫరా చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులైనా స్పందించి మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరించి తాగునీటి ఇబ్బందులు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

