స్వర్ణకారులకు సర్కారు చేయూత
తెలంగాణ ప్రభుత్వం స్వర్ణకారులకు చే యూతనిస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మోనప్పగుట్ట వద్ద ఉన్న మౌనేశ్వర ఆలయంలో స్వర్ణకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బంగారంతో తయారు చేసిన వ స్తువులను వినియోగదారులకు అందించడంలో వారి నమ్మకానికి నిదర్శనమన్నారు.
- వారికి ఎల్లవేళలా అండగా ఉంటా..
- రిజర్వేషన్ల పితామహుడు సాహూ మహరాజ్
- వ్యాపార రంగంలోఎన్నో మార్పులు
- వచ్చేనెల 2న మెగా జాబ్‌మేళా
- ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- స్వర్ణకారుల ఆత్మీయ సమ్మేళనం
మహబూబ్‌నగర్ అర్బన్, ఆగస్టు 14 : తెలంగాణ ప్రభుత్వం స్వర్ణకారులకు చే యూతనిస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మోనప్పగుట్ట వద్ద ఉన్న మౌనేశ్వర ఆలయంలో స్వర్ణకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బంగారంతో తయారు చేసిన వ స్తువులను వినియోగదారులకు అందించడంలో వారి నమ్మకానికి నిదర్శనమన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి తో వ్యాపార రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. కులవృత్తులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. స్వర్ణకారులకు ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసానిచ్చారు. స్వర్ణకారుల విద్యా ర్థి వసతి గృహం ఏర్పాటుకు సహకారం అందిస్తానన్నారు. మౌనేశ్వర ఆలయానికి సీసీ రోడ్డు వేశామని, షెడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలు అందించామన్నారు. కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు రామాచారి, కృష్ణమాచారి, నర్సింహాచారి, రఘు, గోవర్ధనాచారి తదితరులు పాల్గొన్నారు.
రిజర్వేషన్ల పితామహుడు సాహూ మహరాజ్
దేశంలో మొదటిసారి రిజర్వేషన్ వి ధానాన్ని అమలు చేసిన పితామహుడు సాహూ మహరాజ్ అన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్‌లోని సుదర్శన్ కన్వెన్షన్ హాల్లో డిక్కీ (దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కా మర్స్) తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగ, వ్యాపార అవకాశాల అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 2న శిల్పారామంలో నిర్వహించే మెగా జాబ్ మేళాలో 100 కంపెనీల ఆధ్వర్యంలో 10 వేల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతీయువకులు ఉద్యోగ మేళాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అందరూ సమానంగా ఎదగాల నే ఉద్దేశంతో డిక్కీ జాతీయ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత రవికుమార్ చే స్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్ర తి నియోజకవర్గంలో దళితబంధు అం దించాలని సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీలకు అ ధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ వెంకన్న, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమా న్, డిక్కీ రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ, వెం కటయ్య, సైకాలజిస్ట్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

