జ్యూట్ బ్యాగులతో మిరాకిల్
పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఈ క్రమంలో ప్రజలు జూట్ బ్యాగులు వాడాలని సూచిస్తున్నది.
- స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శిక్షణ
- జూట్ బ్యాగుల తయారీకి ఆసక్తి చూపుతున్న మహిళలు, యువతులు
- మానవపాడు మండలంలో ఇప్పటివరకు 60 మందికి ట్రైనింగ్
- బ్యాంకు రుణాలు కూడా పొందే అవకాశం
మానవపాడు, డిసెంబర్ 20 : పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఈ క్రమంలో ప్రజలు జూట్ బ్యాగులు వాడాలని సూచిస్తున్నది. జూట్ బ్యాగుల తయారీపై నాబార్డు ఆధ్వర్యంలో మిరాకిల్ స్వచ్ఛంద సంస్థ శిక్షణ ఇస్తున్నది. మానవపాడు మండలంలో శిక్షణ కార్యక్రమం కొనసాగుతున్నది. మానవపాడు, అమరవాయి గ్రామాల్లోని 60 మంది యువతులు, మహిళలకు నీలవేణి, నబీ శిక్షణ ఇస్తున్నారు. ఉచితంగా శిక్షణ ఇస్తుండడంతో మహిళా గ్రూపుల సభ్యులు, యువతులు ఆసక్తి చూపుతున్నారు. ఇంటి పట్టునే ఉండి స్వచ్ఛందంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి మంచి ఆదాయ వనరుల్లో జూట్ బ్యాగుల తయారీ ఒకటి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించే కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాకుండా బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలు కూడా పొందొచ్చు. వస్తువులను బ్యాగులో సులువుగా తీసుకెళ్లేలా బట్ట, జనపనారతో బ్యాగులను తయారు చేస్తున్నారు. ఈ బ్యాగులపై నచ్చిన లోగోలు, డిజైన్లు వేసుకోవచ్చు. ఉతికి ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. ఈ బ్యాగులను రిటైల్ షాపులు, మాల్స్‌కు విక్రయించుకునే వీలున్నది. మహిళలు చేతిపర్సులుగా వీటిని ఉపయోగించడంతో అనుహ్యమైన మార్పు పెరిగి మార్కెట్లో డిమాండ్ పెరిగింది. మార్కెట్లో చదరపు మీటర్ జూట్ బ్యాగుకు రూ.35 చొప్పున ఉన్నది. ఈ మేరకు బ్యాగులను రూ.100 నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ వ్యాపారాన్ని రూ.30 వేల పెట్టుబడితో ప్రారంభించుకోవచ్చు.
మహిళలు ఆసక్తి చూపుతున్నారు..
జూట్ బ్యాగుల తయారీ శిక్షణకు మండలంలోని మహిళలు ఆసక్తి చూపుతున్నారు. 23 రకాల బ్యాగులను ఎలా తయారీ చేయాలో నేర్పిస్తున్నాం. ఇ ప్పటివరకు 60 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. ఎంత మంది వచ్చినా నేర్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. మహిళా సమాఖ్య సభ్యుల ప్రోత్సాహం బాగుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించొచ్చు.
– నీలవేణి, ట్రైనర్
సద్వినియోగం చేసుకోవాలి..
జూట్ బ్యాగుల తయారీ ఉచిత శిక్షణను యువతులు, మహిళలు స ద్వినియోగం చేసుకోవాలి. కుటీర పరిశ్రమ నెలకొల్పేందుకు తమ వంతు సాయం అందిస్తాం. బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందొచ్చు. ప్రభుత్వాలు ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించనున్నందున మార్కెట్లో జూట్ బ్యాగులకు మంచి డిమాండ్ ఉన్నది.
– కోటేశ్వరి, ఏపీఎం
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

