లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలి
లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ రవినాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ లోక్‌సభ ఎన్నికలపై సమీక్షించారు.
- మహబూబ్‌నగర్ కలెక్టర్ రవినాయక్
మహబూబ్‌నగర్, మార్చి 13 : లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ రవినాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ లోక్‌సభ ఎన్నికలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నోడల్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. బాధ్యతగా, ఎన్నికల నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని సూచించారు. 18మందిని నోడల్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు.
సిబ్బంది, మెటీరియల్ మేనేజ్మెంట్, శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, ట్రాన్స్‌పోర్టు మేనేజ్మెంట్, కంప్యూటరైజేషన్, సైబర్ సెక్యూరిటీ, ఐటీ, స్వీప్, లా అండ్ ఆర్డర్, సెక్యూరిటీప్లాన్, ఈవీఎంల నిర్వహణ, ఎన్నికల వ్యయ పర్యవేక్షణ, బ్యాలెట్ పేపర్, పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీఎస్ కంట్రోల్ రూం, సీ విజిల్ ఫిర్యాదులు స్వీకరణ, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనతోపాటు తదితర అంశాలపై నోడల్ అధికారులను నియమించడం జరిగిందన్నారు.
ఎన్నికలు పకడ్బందీగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావు, అదనపు ఎస్పీ రాములు, జెడ్పీ సీఈవో రాఘవేంద్రరావు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

