శతమారం భవత
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు అభిమానులు, నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు, కూడళ్లల్లో కేకులు కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.
- ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
- ఉమ్మడి జిల్లాలో కేక్ కటింగ్ల జోరు
- చెక్‌డ్యాం వద్ద వేడుకలు చేసిన ఆల
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు అభిమానులు, నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు, కూడళ్లల్లో కేకులు కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. దవాఖానల్లో రోగులకు, పాలమూరులోని అంధుల పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై, ప్రియనేత నిండు నూరేండ్లు వర్ధిల్లాలని మనసారా కోరుకున్నారు.
వెల్దండకు చెందిన పార్టీశ్రేణులు రాజధానిలోని తెలంగాణ భవన్లో రక్తదానం చేయగా.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. అడ్డాకులలో గిఫ్ట్ ఏ స్మైల్ కింద స్థానికులకు గొడుగుల పంపిణీ చేశారు. భూత్పూరు మండలం పాత మొల్గర శివారులో నూతన చెక్‌డ్యాం వద్ద పార్టీ కా ర్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కేక్ కటింగ్ చేశారు. యువతకు రోల్ మోడల్ కేటీఆర్ అ ని కొనియాడారు. అలాగే హైదరాబాద్‌లో కేటీఆర్‌ను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి కలిసి పుష్పగుచ్ఛం అందించి బర్త్‌డే విషెస్ తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

