రాజీ కోసమే లోక్ అదాలత్
రాజీకేసులకు లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లాజడ్జి పాపిరెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాద కేసులో మృ తుడి కుటుంబానికి రూ.కోటి 3లక్షల పరిహారం చెల్లించాలని మహబూబ్‌నగర్ జిల్లా కోర్టు జడ్జి పాపిరెడ్డి శుక్రవారం తీర్పు వెల్లడించిన నేపథ్యంలో బీమా కంపెనీకి చెందిన స్టేట్ లీగల్ అధికారి శశాంక్, లీగల్ మేనేజర్ ఉదయరెడ్డి, కంపెనీ న్యాయవాది స్వదేశ్ బాధిత కుటుంబ సభ్యులకు పరిహారానికి సంబంధించిన డీ డీని జడ్జి సమక్షంలో అందజేశారు.
- మహబూబ్‌నగర్ జిల్లాజడ్జి పాపిరెడ్డి
మహబూబ్‌నగర్, జూన్ 8: రాజీకేసులకు లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లాజడ్జి పాపిరెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాద కేసులో మృ తుడి కుటుంబానికి రూ.కోటి 3లక్షల పరిహారం చెల్లించాలని మహబూబ్‌నగర్ జిల్లా కోర్టు జడ్జి పాపిరెడ్డి శుక్రవారం తీర్పు వెల్లడించిన నేపథ్యంలో బీమా కంపెనీకి చెందిన స్టేట్ లీగల్ అధికారి శశాంక్, లీగల్ మేనేజర్ ఉదయరెడ్డి, కంపెనీ న్యాయవాది స్వదేశ్ బాధిత కుటుంబ సభ్యులకు పరిహారానికి సంబంధించిన డీ డీని జడ్జి సమక్షంలో అందజేశారు.
జిల్లా కోర్టులో క్రై మ్ నెంబర్ 150పై 20మెటారు బైక్ రోడ్డు ప్రమాదం కేసులో పార్థసారిథి అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్ర మాదంపై జిల్లా కోర్టులో మృతుని భార్య అలివేల నష్టపరిహారం కేసు వేశారు. ఈ మేరకు వాదనలు విన్న అ నంతరం జిల్లా జడ్జి పాపిరెడ్డి శనివారం తీర్పును వెల్లడించారు. జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ 2068 కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించామని తెలిపారు.
సమయం వృథా చేసుకోవద్దు..
జడ్చర్లటౌన్, జూన్ 8: సివిల్, క్రిమినల్ కేసుల్లో ఇ రుపక్షాలు రాజీకుదుర్చుకునేందుకు లోక్‌అదాలత్ కా ర్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జడ్చర్ల ప్రిన్సిపల్ కోర్టు జడ్జి టి.లక్ష్మి అన్నారు. శనివారం జడ్చర్ల కోర్టులో లోక్‌అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా జడ్చర్ల ప్రిన్సిపల్ కోర్టు జడ్జి టి.లక్ష్మి లోక్అదాలత్నుద్దేశించి మాట్లాడారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో ఇ రుపక్షాలు రాజీపడి లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చన్నారు.
చిన్నచిన్న తగాదాలతో కోర్టుల చుట్టూ తి రిగి డబ్బు, సమయం వృథా చేసుకోవద్దన్నారు. రాజీపడే కేసుల్లో ఇరుపక్షాలు రాజీపడి పరిష్కరించుకోవాలన్నారు. అనంతరం జడ్చర్ల ప్రి న్సిపల్, అడిషనల్ కోర్టుల పరిధిలో మొత్తం 126 సివిల్, క్రి మినల్ కేసులతో పాటు బ్యాం కు సంబంధించిన 8 కేసులను పరిష్కరించారు. అలాగే రెండో తరగతి కోర్టు పరిధిలోని 157 డ్రంక్ అండ్ డ్రైవ్, అడ్మిషన్ కే సులను పరిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ కోర్టు జడ్జి ముదాసిర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జంగయ్య, లోక్‌అదాలత్ సభ్యులు ఇఫ్తేకార్, రమేశ్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, న్యాయవాదులు, కోర్టు, పోలీసు, ఎ క్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

