గంపెడాశలతో..
గంపెడాశలతో రైతన్నలు వానకాలం సాగు పనులు మొదలుపెట్టారు. కురిసిన వర్షంతో హలం పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. కొందరు ఇప్పటికే విత్తనాలు విత్తి గుంటుక కొడుతుండగా.. ఉత్సాహంగా కూలీలు కలుపు తీసే పనిలో నిమగ్నమయ్యారు..
- వానకాలం సాగులో రైతన్నల నిమగ్నం
- కురిసిన వర్షం.. హలం పట్టిన రైతన్న
- గద్వాల జిల్లాలో విత్తుతున్న విత్తనాలు
- నల్లరేగడిలో మెరవనున్న తెల్లబంగారం
- 1,70,114 ఎకరాల్లో పంట సాగు అంచనా
- బిజీబిజీగా కర్షకులు
గంపెడాశలతో రైతన్నలు వానకాలం సాగు పనులు మొదలుపెట్టారు. కురిసిన వర్షంతో హలం పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. కొందరు ఇప్పటికే విత్తనాలు విత్తి గుంటుక కొడుతుండగా.. ఉత్సాహంగా కూలీలు కలుపు తీసే పనిలో నిమగ్నమయ్యారు.. మరికొందరు విత్తనాల కొనుగోలు, సాగు పనుల్లో తలమునకలయ్యారు. ఈ సీజన్లో జోగుళాంబ గద్వాల జిల్లాలోని నల్లరేగడి భూమిలో తెల్లబంగారం మెరిసిపోనున్నది. 1,70,114 ఎకరాల్లో పంట సాగు చేయనున్నట్లు వ్యవసాయ అధికారుల అంచనా.. తర్వాతి స్థానంలో 94,386 ఎకరాల్లో వరి, 75,843 ఎకరాల్లో మిరప, 26,249 ఎకరాల్లో కందులు, 15,266 ఎకరాల్లో మొక్కజొన్న, 28,290 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు కానున్నాయి. ఇందుకు అవసరమైన 1,13,922 మెట్రిక్ టన్నుల ఎరువులను యంత్రాంగం అందుబాటులో ఉంచింది.
– గద్వాల, జూన్ 26
వారం రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆశల సాగుకు సిద్ధమయ్యారు. రైతుకు కా లం కలిసి వచ్చినా.. రాకున్నా వ్యవసాయంపై ఆశలు వదులుకోక ఈ ఏ డాది నష్టం వాటిళ్లినా వచ్చే ఏడాదై నా కాలం కలిసి రాదా అనే ధైర్యంతో రైతన్న ముందుకు సాగుతున్నాడు. గత వానకాలంలో సరైన వర్షాలు కురియకపోవడంతో రైతులు సాగు చేసిన పంటలకు నీరుఅందక ఎండిపోయి తీవ్రంగా నష్టపోయాడు. ఎం డిన పంటలను పశువుల మేతకు వ దిలి వేశాడు. ఈ వానకాలమైనా కాలం కలిసి రాకపోదా అనే గంపెడాశతో సాగుకు సన్నద్ధమయ్యా రు. కాలం కలిసి వస్తే అప్పులు పోను కడుపు నిం డా అన్నం దొరుకుతుందనే ఆశతో సాగు చేస్తున్నా రు. వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో రైతులు ప్రస్తుతం కురుస్తు న్న వర్షాలకు మురిసి పంటల సాగు చేశారు.
ముమ్మరంగా పొలం పనులు..
గత నెల చివరిలో వర్షం కురియగా మిరప, పత్తి, టమాట, మొక్కజొన్న, కందులు, వేరుశనగ తదితర పంటలు సాగు చేశారు. ప్రస్తుతం అవి మొ లకెత్తడంతో రైతులు మొక్కల మధ్య ఉన్న గడ్డిని తొలగించేందుకు గడెంతో గుంటుక కొడుతున్నా రు. మరికొందరు మొక్కల మధ్య ఉన్న కలుపు మొక్కలను కూలీలతో తీయిస్తున్నారు. వర్షాలకు పొలం పదునుగా ఉండడంతో ఎరువులు చల్లి విత్తనాలు విత్తడానికి పొలాలను సిద్ధం చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో అటు రైతులు పొలం పనుల్లో ఇటు కూలీలు కూలి పనుల్లో బిజీబిజీగా మారిపోయారు. జూరాల, నెట్టెంపాడ్, ఆర్డీఎస్ ద్వారా కాల్వలకు నీరు వదిలితే రైతులు నారుమడులు పోసుకోవడానికి తమ పొలాలను సిద్ధం చేసి ఉంచుకున్నారు. ఈ వర్షాలు ఇలాగే కురిస్తే ఈ ఏడాది రైతన్నకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది.
ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు..
జిల్లాలో అధికారులు ఎరువుల విత్తనాల కొరత లేకుండా చూస్తున్నారు. ఈ వానకాలం సీజన్‌కు
సంబంధించి రైతులకు 1,13,922 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేశారు. ప్ర స్తుతం రైతులకు అవసరమై న ఎరువులు అందుబాటులో వ్యవసాయశాఖ అధికారులు ఉంచారు. జిల్లాకు వరి విత్త నాలు 23,597 క్వింటాళ్లు అ వసరం కాగా.. ప్రస్తుతం 2,582 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు మొక్కజొన్న 1,221 క్విం టాళ్లు అవసరం కాగా 170 క్వింటాళ్లు, కందులు 1,050 క్వింటాళ్లు అవసరం కాగా 255 క్విం టాళ్లు , కాటన్ ప్యాకెట్లు 3,40,228 అవసరం కాగా 1,07,949 ప్యాకెట్లు, చిల్లీ 114 ప్యాకెట్లకు గానూ 82 ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే అవసరం మేరకు ఎరువులు, విత్తన దుకాణదారులు స్టాక్ ఉంచుతున్నారు. ఎరువులు, విత్తనాల విషయంలో ఇప్పటివరకు ఎటువంటి కొ రత లేదని రైతుల అవసరం మేరకు సరఫరా చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి తెలిపారు.
సొంతంగా విత్తనాలు కొన్నాం..
ముందస్తు వర్షాలు కురవడంతో విత్తనాలు విత్తుకు న్నాం. ప్రస్తుతం మొలకలు వచ్చాయి. ఆరు ఎకరాల్లో పత్తి సాగు చేశా.. గత కేసీఆర్ సర్కారు మొక్కలు మెలిచే నాటికి రైతుబంధు సాయం అందించగా.. సాగు ఖర్చులు పోను మొదటి విడుత పెట్టుబడికి సరిపో తుండే.. ఈ వానకాలం ఈ ప్రభుత్వం ఎప్పుడు పెట్టుబడి సాయం అందిస్తుందో తెల్వడం లేదు. ప్రస్తుతం పొలంలో కూలీలతో గడ్డి తీయిస్తున్నాం. ఈ ఏడాది పెట్టుబడి ఖర్చులూ పెరిగాయి.
– కృష్ణ, రైతు, కుర్వపల్లి, గద్వాల మండలం
పెట్టుబడి సాయం అందించాలి..
నేను రెండు ఎకరాల్లో సీడ్ ఆర్గనైజర్ల వద్ద పత్తి విత్తనాలు తీసుకొచ్చి విత్తనాలు విత్తాను ప్రస్తుతం అవి మొలక దశలో ఉన్నాయి. అవి కొద్దిగా పెరిగితే కలుపుతోపాటు ఎరువులకు డబ్బులు అవసర మవుతాయి. పెట్టుబడి ఇప్పటి వరకు సొంతంగా పెట్టుకున్నాను. గత ప్రభుత్వం లాగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం త్వరగా అందజేస్తే ఎరువులకు ఉపయోగపడతాయి. ఈ ఏడాది కాలం కలిసి వస్తే అప్పులు తీరి నాలుగు పైసలు చేతికి వస్తాయి.
– నర్సింహులు, రైతు, సద్దలోనిపల్లి, మల్దకల్ మండలం
జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇలా..
జోగుళాంబ గద్వాల జిల్లాలో నల్లరేగడి, ఎర్రనేలలు ఎక్కువగా ఉన్నాయి. నల్లరేగడిలో రైతులు ఎక్కువగా పత్తితో పాటు మిర్చి, వరి, కందులు సాగు చేయగా ఎర్రనేలల్లో రైతులు వేరుశనగ, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారు. ఈ వానకాలంలో రైతులు జిల్లాలో 94,386 ఎకరాల్లో వరి, మొక్కజొన్న 15,266 ఎకరాలు, కందులు 26,249 ఎకరాలు, పత్తి 1,70,114 ఎకరాల్లో, మిర్చి 75,843 ఎకరాలు, వేరుశనగ 8,797 ఎకరాలు ఉద్యానవ పంటలు 28,290 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

