పాలమూరు, ఏప్రిల్ 1 : మహబూబ్‌నగర్‌లోని అంబేద్కర్ కళాభవన్‌లో మూడు నెలల గ్రూప్స్ కో చింగ్‌కు ఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి పాండు సోమవారం ప్రకటనలో తెలిపారు. టెన్త్, డిగ్రీ, టీసీ, డిగ్రీ ప్రొవిజినల్, కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలతో రిపోర్ట్ చేయాలని, వివరాలకు 8977340006 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.