మార్కెట్లో మొదలైన సందడి
హోలీ పండుగ అంటేనే ప్రతిఒక్కరిలో నూతనోత్సహం ఉరకలేస్తుంది. హోలీ రోజున చిన్నా పెద్దా తేడాలేకుండా ఊరూ వాడ ఏకమై సంబురాల్లో మునిగిపోతారు.
- నేడు హోలీ పండుగ
- పిల్లలను ఆకట్టుకునేలా గన్లు, బెలూన్లు
- సహజసిద్ధమైన వాటికి ప్రాధాన్యత
ప్రకృతి అందాలకు కొత్తందం తీసుకొచ్చే వసంతరుతువు ప్రవేశించిన తరువాత జరుపుకొనే తొలి పండుగ హోలి. చిన్న, పెద్ద, ఊరూవాడా ఏకమై రంగుల్లో తడిసిముద్దయ్యేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. మనసులోని బాధలన్నింటినీ రంగులతో కడిగేసే మధుర క్షణాలు రానే వచ్చాయి. నేడు రంగుల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. కాగా, సహజసిద్ధమైన రంగులతో హోలీ జరుపుకొనేందుకు ఇష్టపడుతున్నారు.
– నెట్వర్క్, మార్చి 6
గద్వాలటౌన్/ఆత్మకూరు/నాగర్‌కర్నూల్‌టౌన్/మహబూబ్‌నగర్, మార్చి 6: హోలీ పండుగ అంటేనే ప్రతిఒక్కరిలో నూతనోత్సహం ఉరకలేస్తుంది. హోలీ రోజున చిన్నా పెద్దా తేడాలేకుండా ఊరూ వాడ ఏకమై సంబురాల్లో మునిగిపోతారు. హోలీ కంటే ముందు కామదహనం చేసి సంబురాలు జరుపుకొంటారు. హోలీ పండుగ ఈ నాటిది కాదు. హోలీ సంబురాలు ద్వాపర యగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు జరుపుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాగే హోలికా రాక్షసి అంతమైన రోజుగా భావిస్తూ ఉత్సవాలు జరుపుకుంటారు. వసంతమాసం ఆగమనానికి గుర్తుగా వసంతకేళి ఆడడం ఆనవాయితీగా వచ్చిందని మరికొందరు చెబుతారు. దేశం మొత్తం మీద హోలీ పండుగను వసంత మాసంలో వచ్చే హేలిక పౌర్ణమి నాడు ఘనంగా జరపుకోవడం జరుగుతుంది.

హోలిక అంతమైన రోజు కావడంతో…
హిరణ్యకశపుని చెల్లెలు హోలిక. హిరణ్యకశపుడు కుమారుడు ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణ మంత్రం మానక పోడవడంతో కఠినంగా శిక్షించాలని తలుస్తాడు. హోలికాకు మంటల్లో తగలబడకుండా శక్తి ఉండడంతో ప్రహ్లాదుడిని హోలికా చేతుల్లో అగ్నికి ఆహుతి ఇవ్వాలని అనుకుంటాడు హిరణ్యకశపుడు. అన్న ఆదేశాల మేరకు హోలిక ప్రహ్లాదుడిని తనపై కూర్చోబెట్టుకుని అగ్నిలో ప్రవేశిస్తుంది. కాగా, ప్రహ్లాదుడు నారాయణ జపం చేస్తాడు. దీంతో హోలిక అగ్నికి ఆహుతైపోయి ప్రహ్లాదుడు బయటపడతాడు. అందుకుగానూ దుష్టతత్వంపై సాధించిన విజయంగా, చెడుపై మంచి జయించిన రోజుగా ప్రజలు ఒకరిపై ఒకరు పసుపు, కుంకుమ చల్లుకుంటూ సంబురాలు జరుపుకుంటారు. అలాగే, చందనం, కస్తూరి పరిమాలల నీళ్లు ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఆనందోత్సవంలో మునిగిపోతారు. హోలిక అంతమైంది హేలిక పౌర్ణమి నాడు కావడంతో ఏటా వసంతమాసంలో హోలి జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.
కామ దహనాన్ని ప్రత్యేకత
హోలీ పండుగకు సంబంధించిన మరోకథ ప్రాచుర్యంలో ఉంది. పార్వతిదేవి శివుడిని పెండ్లి చేసుకోవడానికి నిశ్చయించుకుంటుంది. మహా తపస్సులో ఉన్న శివుడిని తనవైపు మరల్చుకోవాలన్న సంకల్పంతో కామదేవుడుచే శివుడిపైకి పూలబాణం వేయిస్తుంది. తపస్సు భంగమైన మహాశివుడు కోపంతో కామదేవుడిని తన త్రినేత్రంతో దగ్ధం చేస్తాడు. దీంతో కామదేవుడి భార్య రతి తన భర్తను రక్షించమని వేడుకుంటుంది. దీంతో కామదేవుడిని తిరిగి బతికిస్తాడు. అయితే భౌతికకామం కంటే ఆధ్యాత్మికతను తెలియజేసే ప్రేమ మాత్రమే పంచే ప్రతిరూపంగా మాత్రమే కామదేవుడిని బతికిస్తాడు. అందుకే కామదహనం జరుపుకుంటారన్న నానుడి ప్రచారంలో ఉంది.
సహజ రంగులతో హోలీ
వసంతకాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వైరల్ జ్వరం, జలుబు ఇతరాత్ర జబ్బులు వస్తాయి. ఈ కాలంలో వచ్చే వైరల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రకృతి సిద్ధమైన రంగులను గతంలో వాడేవారు. ఔషధ గుణాలున్న రంగులను వాడటం వల్ల వైరల్ వ్యాధులు పూర్తిగా నయం అయ్యేవని నాటి కాలం వారు చెప్తారు. నాడు వాడే సహజ రంగుల్లో పసుపు, కుంకుమ, బుక్క గులాలు, బిల్వ ఆకుల రసం, మోదుగ పూలు, తంగేడు పూలరసం, గుంటగలగర ఆకు రసం, గంధం ఇలా ఎన్నో సహజ సిద్ధ రంగులతో హోలీ జరుపుకునే వారు. కానీ, రాను రాను సహజసిద్ధ రంగులు మాయమయ్యాయి. వాటి స్థానంలో రసాయన రంగులు వచ్చాయి.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

