బతుకమ్మ సంబురం
మండలం వ్యాప్తంగా ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తీరొక్క పూల తో బతుకమ్మలను అందంగా పేర్చి, పసుపు కుంకుమతో గౌరమ్మను చేసి పూజించారు.
- ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
- ఉత్సాహంగా ఆడిపాడిన మహిళలు
- చెరువుల్లో నిమజ్జనం చేసిన ఆడపడుచులు
- నేడు విజయదశమి
మక్తల్ టౌన్, అక్టోబర్ 22: మండలం వ్యాప్తంగా ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తీరొక్క పూల తో బతుకమ్మలను అందంగా పేర్చి, పసుపు కుంకుమతో గౌరమ్మను చేసి పూజించారు. సాయంత్రం అందగా పేర్చి న బతుకమ్మలతో మహిళలు, చిన్నారులు ప్రధాన కూడళ్లకి చేరుకొని బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ మహిళలు, యువతులు ఉత్సాహంగా ఆడిపాడారు. అనంతరం బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక
ఊట్కూర్, అక్టోబర్ 22 : బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని మాజీ జెడ్పీటీసీ అరవింద్కుమార్, మాజీ సర్పంచ్ భాస్కర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని లాల్బహద్దూర్ నగర్లో బతుకమ్మ వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని ప్రసంగించారు. అనంతరం విద్యార్థులు, యువతులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అంత కు ముందు మహిళలు, ప్రజాప్రతినిధులు బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కృష్ణయ్యగౌడ్, వా ర్డు సభ్యుడు నర్సింహారాజ్గౌడ్, మహిళలు పాల్గొన్నారు.
ఆత్మకూరులో..
ఆత్మకూరు, అక్టోబర్ 22: మండలం వ్యాప్తంగా ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఇండ్లల్లో పూజలు చేసి సాయంత్రం గ్రామ ప్రధాన వీధుల్లోకి చేరి చిన్నా పెద్దా తేడాలేకుండా బతుకమ్మ పాటలతో ఉత్సాహంగా ఆడిపాడారు. అనంతరం బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని పట్టణంలోని మల్లాపురం ఆలయంలో, వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయం, నీలకంఠేశ్వరస్వామి ఆలయం, వాల్మీకినగర్, కోట్ల ఆంజనేయస్వామి ఆలయలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాల వద్ద మహిళలు బతుకమ్మ ఆడారు.
అమరచింతలో..
అమరచింత, అక్టోబర్ 22: మండలంలో ఆదివారం సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని దశమికట్ట వద్దకు మహిళలు బతుకమ్మలతో తరలి వచ్చి బొడ్డెమ్మలు వేస్తూ ఆడిపాడారు. అనంతరం నిర్వహకులు అందంగా బతుకమ్మలను తయారు చేసిన మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నిర్వా హకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

