Gadwal: పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలనే టీఎస్ ఐ పాస్ ద్వారా అనుమతులు: కలెక్టర్ క్రాంతి

గద్వాల: జిల్లాలో పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలనే ఆలోచనతో ప్రభుత్వం టీఎస్ ఐపాస్ ఏర్పాటు చేసి దాని ద్వారా వేగవంతంగా అనుమతులు మంజూరు చేస్తున్నదని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలె క్టర్ సమావేశపు మందిరంలో టీఎస్ ఐ-పాస్, డీఐపీసీ సమావేశం జిల్లా అధికారుతో కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఈ సంద ర్భంగా జిల్లాలో పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నఅనుమతుల వివరాలు కలెక్టర్ జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యాదగిరిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగులకు చేయూతనివ్వాలనే ఆలోచన, పారి శ్రామిక వేత్తలను ప్రోత్సహించా లనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం టీఎస్ ఐపాస్ ఏర్పాటు చేసిందని దీని ద్వారా పరిశ్రమల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకునే వారికి వారి అర్హతను బట్టి అనుమతులు వేగవంతంగా మంజూరు చేయాలని ఆదేశించారు. అనుమతులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.
జిల్లాలో ఇప్పటి వరకు 215 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. దీనిని మంరిత పెంచాలని అధికారులకు సూచించారు. టీప్రీడ్జీ స్కీం ద్వారా 20మంది ఎస్సీ ప్రారిశ్రామిక వేత్తలకు రూ.49.90లక్షలు, నలుగురు ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ.12.90 లక్షలు ట్రాక్టర్స్, ఆటోలకు సబ్సిడీ మంజూరు చేశామని తెలిపారు.
ఈ స్కీం కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు (పురుషులు)35 శాతం, ఆడ వాళ్లకు 45 శాతం, పీహెచ్సీ పురుషులకు 35శాతం, ఆడవాళ్లకు 45శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అధికారులు పురుషోత్తంరెడ్డి, తిరుపతిరావు, భాస్కర్‌రెడ్డి, రమేశ్‌బాబు, శ్రీనివాసులు, సుధాకర్, పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

