కేంద్రం గాడిద గుడ్డు.. రాష్ట్రం గుండు సున్న ఇచ్చాయి..
బడ్జెట్ కే టాయింపులో కేంద్రం తెలంగాణకు గాడి ద గుడ్డు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తాను ఏమీ తకువ కాదు అన్నట్లుగా జిల్లాకు గుండు సున్నా ఇచ్చిందని నారాయణపే ట మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షు డు ఎస్ రాజేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడు తూ ఆరు గ్యారెంటీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్ర భుత్వం గురువారం ప్రవేశ పెట్టిన 20 24-25 బడ్జెట్లో మరోసారి ప్రజలను మోసం చేసిందన్నారు.
- కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లపై మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి
నారాయణపేట, జూలై 25 : బడ్జెట్ కే టాయింపులో కేంద్రం తెలంగాణకు గాడి ద గుడ్డు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తాను ఏమీ తకువ కాదు అన్నట్లుగా జిల్లాకు గుండు సున్నా ఇచ్చిందని నారాయణపే ట మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షు డు ఎస్ రాజేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడు తూ ఆరు గ్యారెంటీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్ర భుత్వం గురువారం ప్రవేశ పెట్టిన 20 24-25 బడ్జెట్లో మరోసారి ప్రజలను మోసం చేసిందన్నారు.
తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడు నెలలు అవుతున్నా ఇంతవరకు ఆరు గ్యారెంటీ లను అమ లు చేయకపోగా బడ్జెట్లో వాటికి నిధుల కేటాయిం పు కూడా చేయలేదన్నారు. ప్రతి మహిళకు రూ. 2,500, నిరుద్యోగ భృతి, కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షతోపాటు తులం బంగారం, పంటకు రూ. 500 బోనస్, రూ.2016 నుంచి రూ.4000కు పెన్ష న్ పెంచి ఇస్తామని చెప్పినా వాటికి బడ్జెట్లో ఎకడా నిధుల కేటాయింపు చేయలేదని ఆరోపించారు.
అంతేకాకుం డా పాలమూరు – రంగారెడ్డిలో భాగంగా తమ హయాంలో నారాయణపేట మెయిన్ కెనాల్‌కు టెండర్లు పూర్తి కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని, నారాయణపేట మెయిన్ కెనాల్ నిర్మాణానికి నిధులు కేటాయింపు లేదని, నూతన జిల్లా దవాఖాన భవనంలో నే మెడికల్ కళాశాల నిర్వహిస్తున్నారని, నూతన మెడికల్ కళాశాల నిర్మాణానికి నిధుల కేటాయింపు ప్రస్తావన లేదని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి నిధుల కేటాయింపు లేదని ఎద్దేవా చేశారు. ఎంపీగా గెలిపిస్తే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెప్పిస్తామని, నారాయణపేట జిల్లాకు రైల్వే లైన్, నవోదయ, సైనిక్ సూల్ తీసుకొస్తామని ఎన్నికల సమయంలో పెద్దపెద్ద ప్రగల్భాలు పలికిన బీజేపీ నాయకులు నేడు కేంద్రం ఒ క రూపాయి ఇవ్వకున్నా ఎందుకు నోరు విప్పడం లేదని ఆయన ప్రశ్నించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

