పేలుడు పదార్థాల కలకలం
అనుమతులు లేకుండా ఓ గుడిసెలో నిల్వ ఉంచిన పేలుడు సామగ్రిని మహబూబ్‌నగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించిన ఘటన మంగళవారం జడ్చర్లలో వెలుగుచూసింది.
- జడ్చర్ల పట్టణంలోని ఓ గుడిసెలో పట్టివేత
- 2,700 జిలెటిన్ స్టిక్స్, 2,500 డిటోనేటర్స్ స్వాధీనం
జడ్చర్ల టౌన్, జనవరి 31: అనుమతులు లేకుండా ఓ గుడిసెలో నిల్వ ఉంచిన పేలుడు సామగ్రిని మహబూబ్‌నగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించిన ఘటన మంగళవారం జడ్చర్లలో వెలుగుచూసింది. జడ్చర్ల సీఐ రమేశ్‌బా బు కథనం ప్రకారం.. పట్టణంలోని విజయనగర్‌కాలనీలో వడ్డె బాలయ్యకు చెందిన గుడిసెలో భారీగా పేలుడు పదార్థాలు ఉన్నాయనే సమాచారంతో పాలమూరు టాస్క్‌ఫోర్స్ సీఐ రవికుమార్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈక్రమంలో బాలయ్య తన కంప్రెషన్‌తో గుట్టలపై బండరాళ్లను పేల్చేందుకు వనపర్తి జిల్లా పెబ్బేర్‌కు చెందిన రాజేశ్ నుంచి పేలుడు పదార్థాలను దిగుమతి చేసుకున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. తనిఖీలో పట్టుబడిన పేలుడు పదార్థాల (2,700 జిలెటిన్ స్టిక్స్, 2,500 డిటోనేటర్స్)ను స్వాధీనం చేసుకొని జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేశ్‌బాబు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని.. వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు. పేలుడు పదార్థాలు ఇండ్ల మధ్య నిల్వ చేయటంపై పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు దీనిపై దృష్టిసారించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

