రోడ్డెక్కిన పాడి రైతులు
పెండింగ్‌లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని పాడి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిల్లులను విడుదల చే యాలని కోరుతూ శుక్రవారం మండలంలోని బో యిన్‌పల్లి వద్ద కల్వకుర్తి-జడ్చర్ల ప్రధాన రహదారిపై పాడి రైతులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
- పాల బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్
- బోయిన్పల్లి వద్ద రహదారిపై బైఠాయించి నిరసన
మిడ్జిల్, జూన్ 28 : పెండింగ్‌లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని పాడి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిల్లులను విడుదల చే యాలని కోరుతూ శుక్రవారం మండలంలోని బో యిన్‌పల్లి వద్ద కల్వకుర్తి-జడ్చర్ల ప్రధాన రహదారిపై పాడి రైతులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు నెలలుగా మండలంలో సుమారు రూ.2.5కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, నేటికీ అందక ఇబ్బందులు పడుతున్నామన్నారు. 15రోజులకోసారి చెల్లించాల్సిన బిల్లు లు 60 రోజులు దాటినా ఇవ్వకపోవడంపై వారు ఆ గ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించకపోవడంతో దాణాను కొనుగోలు చేయలేకపోతున్నామని రైతు లు వాపోయారు. పెండింగ్‌లో ఉన్న లీటర్‌కు రూ.4 ప్రోత్సాహక బిల్లులు వెంటనే చెల్లించకపోతే నిరాహార దీక్ష చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైస్ ఎంఎంపీ తిరుపతమ్మ, మాజీ స ర్పం చ్ నారాయణరెడ్డి, నాయకులు రవీందర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, శేఖర్, నరేశ్, హరికృష్ణారెడ్డి, వెంకటేశ్‌రెడ్డి, సత్యం, నర్సింహ, శ్రీను, గణేశ్, బంగారు, రాము, అమర్‌నాథ్‌రెడ్డితోపాటు పాడి రైతులు పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
- ఇప్పటికే అప్పుల పాలయ్యాం
- మాజీ సర్పంచుల డిమాండ్

అయిజ, జూన్ 28 : పంచాయతీల అభివృద్ధిలో భాగస్వాములైన తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించి ఆదుకోవాలని మాజీ సర్పంచులు అధికారులకు మొరపెట్టుకున్నారు. శుక్రవారం పట్టణంలోని మండలపరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ ప్రహ్లాదరెడ్డి, ఎంపీడీవో వెంకటయ్య, ఎంపీవో నర్సింహారెడ్డిలకు మాజీ సర్పంచులు వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. ఐదేండ్ల కా లంలో ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో పంచాయతీలను అభివృద్ధి చేశామని, నిధులు మంజూరైనా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు నెలల కిందటే ఖర్చు చేసిన నిధులకు ఎంబీలు చేసినప్పటికీ బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ప్రస్తుత ప్రత్యేకాధికారులు తాము చేసిన పనులకు బిల్లులు చేసుకుంటున్నారని, తమకు రావాల్సిన బిల్లులు మాత్రం చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. పదిరోజుల్లో బిల్లులు చెల్లించాలని, లేనిపక్షంలో జిల్లావ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎంపీవో మాట్లాడుతూ ప్రస్తుతం జీపీల్లో జమ చేస్తున్న నిధులను పెండింగ్ బిల్లులకు చెల్లిస్తున్నామన్నారు. త్వరలో అందరికీ చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు తిప్పారెడ్డి, హన్మంతురెడ్డి, నీలకంఠారెడ్డి, నాయకులు కిశోర్, రామలింగన్న ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

