రేవంత్‌రెడ్డి.. ఖబడ్దార్
రాజకీయంగా ఎదుర్కోలేక రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నేతలపై దాడులకు పాల్పడడం సిగ్గుచేటని, ఇలాగే వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని గనుల, భూగర్భశాఖల మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం కోస్గిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
- ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఓపిక పడుతున్నాం
- కాంగ్రెస్‌కు కొడంగల్‌లో ఓటమి ఖాయం
- సర్జఖాన్‌పేట్ దాడిని ఖండిస్తున్నాం
- మా జోలికి వస్తే ఊరుకునేది లేదు..
- భూగర్భ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి
కోస్గి , నవంబర్ 15 : రాజకీయంగా ఎదుర్కోలేక రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నేతలపై దాడులకు పాల్పడడం సిగ్గుచేటని, ఇలాగే వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని గనుల, భూగర్భశాఖల మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం కోస్గిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి మాదిరిగా రౌడీలా వ్యవహరించలేమని, ప్రజాస్వామ్యాని కాపాడేందుకు ఓపికతో ఉన్నామన్నారు. సర్జఖాన్పేట్లో మంగళవారం సోమశేఖర్‌రెడ్డి, ఆయన అనుచరులు ప్రచారానికి వస్తే రేవంత్‌రెడ్డి కిరాయి గుండాలతో మూడు రోజుల నుంచి గస్తీ నిర్వహించి పథకం ప్రకారం దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఓటమి భయంతో ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని అలజడులు సృష్టించడం సరికదన్నారు. కొడంగల్‌లో నిర్వహించిన కేటీఆర్ రోడ్ షోకు వచ్చిన జనాన్ని చూసి ఇలా దాడులకు పాల్పడుతున్నారని, మా జోలికి వస్తే ఊరుకోమని స్పష్టంచేశారు. నియోజకర్గంలో ఉన్న ప్రజలు ఐదేండ్లుగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలతో ఆనందంగా ఉన్నారని, ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేయవద్దన్నారు.
ఎన్ని జిమ్మిక్కులు చేసినా కాంగ్రెస్ వచ్చేది లేదన్నారు. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి నిత్యం ప్రజలకు అందుమాటులో ఉండి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయమన్నారు. అంతకుముందు కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తలు కోస్గికి చెందిన విజయ్‌కుమార్, సంపల్లి మైబులను మంత్రి పరామర్శించి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. అనంతరం జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయొద్దీన్ మాట్లాడుతూ.. అప్రజాస్వామికంగా ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. సమావేశంలో ఈజీఏస్ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి, ఇన్చార్జి కృష్ణారావు, మున్సిపల్ అధ్యక్షుడు రాజేశ్, కౌన్సిలర్లు శ్రీను, జనార్దన్‌రెడ్డి, నాయకులు మాధుసూదన్యాదవ్, రాజేందర్‌రెడ్డి, వరప్రసాద్, నటరాజ్, వెంకటేశ్ తదితరులు పాల్గ్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

