పాల బిల్లులు చెల్లించాలి
రెండు నెలలుగా బకాయి ఉన్న పాలబిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గు రువారం పాడి రైతులు కల్వకుర్తి పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రం ఎదుట కల్వకుర్తి -హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీకి పాలు పోస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలబిల్లులు సక్రమంగా చెల్లించడం లేదని ఆవేదన వ్యకం చేశారు.
- కల్వకుర్తి హైదరాబాద్ ప్రధాన రహదారిపై పాడి రైతుల ధర్నా
కల్వకుర్తి, జూలై 25 : రెండు నెలలుగా బకాయి ఉన్న పాలబిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గు రువారం పాడి రైతులు కల్వకుర్తి పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రం ఎదుట కల్వకుర్తి -హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీకి పాలు పోస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలబిల్లులు సక్రమంగా చెల్లించడం లేదని ఆవేదన వ్యకం చేశారు. ఎప్పుడు చూసిన రెండు నెలలకు పైగా బిల్లులు బకాయి ఉంటున్నాయని వాపోయారు. ప్రతి 15 రోజలకోసారి పాల బిల్లులు చె ల్లించాల్సి ఉండగా రెండు నెలల బకాయిలను తమ వద్ద ఉంచుకొని విజయ డెయిరీ నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
తాము పోసిన పాలకు బిల్లులు చెల్లించకుండా మమ్మల్ని ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇదేనా రైతు ప్రభుత్వమంటే అని రైతులు ప్రశ్నించారు. పాలబిల్లులు సక్రమంగా రాకపోవడంతో పిల్లల ఫీజులు, ఇతర ఖర్చులకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. ముందే ఇది వ్యవసాయానికి పెట్టుబడుల కాలమని, డబ్బులు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఇదే సమయంలో పాల బిల్లులు కూడా రాకపోవడంతో తమ బాధలు వర్ణణాతీతమని రైతులు వాపోయారు. రెండు నెలలకు నాలుగు బిల్లులు బకాయిలు ఉన్నాయని, వెంటనే బకాయిలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. రూ.4 ప్రోత్సాహకం ఊసే ఎత్తడం లేదని రైతులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ గురించి ప్రజాప్రతినిధులు ఎవ రూ పట్టించుకోవడం లేదని, సమస్యలు పరిష్కరించుకుండా ప్రజాప్రతినిధులు తమ గొప్పలను ప్రదర్శించేందుకు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మా బతుకు దెరువు పాడి అని, పాడితోనే బ తుకులీడుస్తున్నామని, పాలబిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం తమను రోడ్డు పాలు చేసిందని తీవ్రంగా మండిపడ్డారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని రైతులతో మాట్లా డి ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో కల్వకుర్తి, వెల్దండ, వంగూర్, చారకొండ, ఊర్కొండ మండలాలకు చెందిన పాడి రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

