Ala Venkateswar Reddy | కాంగ్రెస్ అసమర్థతతో ఎండిన పంటలు : మాజీ ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర్‌రెడ్డి
Ala Venkateswar Reddy | దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ అసమర్థత ( Congress incompetence ) వల్ల పంటలు ఎండిపోయాయని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
దేవరకద్ర : దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ అసమర్థత ( Congress incompetence ) వల్ల పంటలు ఎండిపోయాయని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateswar Reddy ) ఆరోపించారు. గురువారం నియోజకవర్గంలోని కౌకుంట్ల మండలం ముచ్చింతల, దాసరిపల్లి గ్రామాల్లో ఎండిన పంటలను పరిశీలించారు.
ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ, కేంద్రం హెచ్చరించినా గాని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని దుయ్యబట్టారు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చిందని ఆ నీటిని జూరాల మీదుగా మళ్లించ కుండా తాత్సారం చేయడం వల్ల పంటలకు నీరందక ఎండిపోయాయని పేర్కొన్నారు. ప్రభుత్వానికి రైతాంగం శ్రేయస్సు పట్ల సోయి లేదని ఆరోపించారు. నియోజకవర్గంలో ఎండి పోయిన పంటల వివరాలను సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళాతామని వెల్లడించారు.
పంట పెట్టుబడి,బోర్లు వేసినా ఫలితం లేక రెండు రకాలుగా రైతులు నష్టపోయారని, ఒక్కో గ్రామంలో రెండువందలకు పైగా బోర్లు వేసిన చుక్క నీరు పడలేదని తెలిపారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరాకు 50 వేలు నష్టపరిహారం ప్రభుత్వం రైతులకు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ala Venkateswar Reddy | కాంగ్రెస్ అసమర్థతతో ఎండిన పంటలు : మాజీ ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర్‌రెడ్డి
IPL: చెన్నై జట్టులోకి ఎస్ఆర్హెచ్ బ్యాటర్.. 7 కోట్లు వదులుకున్న లివింగ్‌స్టోన్
Anjaiah Yadav | ఎండిన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.. వీడియో
AP News | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 30.50 శాతం పోలింగ్..!
TTD JEO | సనాతన ధర్మ పరిరక్షణలో అర్చకులది కీలక పాత్ర : టీటీడీ జేఈవో
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

