ఉత్కంఠ.. నేడే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్
టిక్.. టిక్.. టిక్.. అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్.. మరికొ న్ని గంటల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సం స్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎవరో తేలనున్నది. రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎమ్మెల్సీ పీఠం ఎవరికి దక్కుతుందోనని అధికార పార్టీతోపాటు బీఆర్ఎస్ నేతలు ఉ త్కంఠగా ఎదురుచూస్తున్నారు.
- పాలమూరు బాలుర కళాశాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు
- నిఘా నీడలో.. బందోబస్తు మధ్య ప్రక్రియ
- పర్యవేక్షించిన మహబూబ్‌నగర్ కలెక్టర్ రవినాయక్
- గెలుపు ధీమాలో బీఆర్ఎస్
- ఓటమి భయంలో కాంగ్రెస్
- ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వివరాలు.. ఎన్నిక జరిగిన తేదీ : మార్చి 28 మొత్తం ఓట్లు : 1439 పోలైన ఓట్లు : 1437
- 10 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రధాన పార్టీల అభ్యర్థులు బీఆర్ఎస్ : నవీన్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ : మన్నె జీవన్‌రెడ్డి
మహబూబ్‌నగర్, జూన్ 1 (నమస్తే తెలంగాణ ప్రతిని ధి) : టిక్.. టిక్.. టిక్.. అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్.. మరికొ న్ని గంటల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సం స్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎవరో తేలనున్నది. రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎమ్మెల్సీ పీఠం ఎవరికి దక్కుతుందోనని అధికార పార్టీతోపాటు బీఆర్ఎస్ నేతలు ఉ త్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కశిరెడ్డి నారాయణరెడ్డి అ సెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారడం.. కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాం గ్రెస్ అధికారం చేపట్టాక జరుగుతున్న తొలి ఎన్నిక కావడం తో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే శాసనసభ ఎన్నికలు పూర్తయినా.. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలింగ్ తర్వాత కౌంటింగ్ నిలిపివేశారు.
పాలమూరు బాలుర కళాశాలలో..
దాదాపు 66 రోజుల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం తేలనున్నది. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపును అధికారులు చేపట్టనున్నారు. నిఘా నీడలో లెక్కింపు కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగనున్నది. జిల్లా కలెక్టర్ రిటర్నిం గ్ అధికారి రవినాయక్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రం లో ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించడంతోపాటు అంతకుముందే ప్రక్రియపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ప్రా ధాన్యతా క్రమంలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తుండడంతో జాగ్రత్తగా అన్ని బ్యాలెట్ పత్రాలను పరిశీలించి ఓట్ల లెక్కింపును చేపట్టాలని సూచించారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నిక ఇటు బీఆర్ఎస్కు.. అటు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. అధికా ర మార్పిడి జరిగిన తర్వాత తొలి ఎన్నిక కావడంతో అధికారపక్షం ఈ ఎన్నికలు సవాల్‌గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని ప్రలోభాలకు సైతం వెనుకాడలేదన్న ఆరోపణలున్నాయి. మరోవైపు ఉమ్మడి జిల్లాలో దాదాపు 90 శాతం మంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉండడం.. వీరిని పెద్ద ఎత్తున కొనుగోలు చేసి పార్టీలు మార్చడం వంటివి చేసినా మెజార్టీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకొని ప్రజాప్రతినిధులందరూ ఆత్మ ప్రబోదం ప్రకారం ఓటేయాలని సూచించారు. కాంగ్రెస్‌ను ఓడించి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. మరోవైపు సీఎం రేవంత్ సొంత జిల్లా కావడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపాలైతే రాజకీయ పరిణామాలు మలుపు తి రిగే అవకాశాలు ఉన్నాయి. మరో రెండ్రోజుల్లో పార్లమెంట్ ఫలితాలు కూ డా ఉండడంతో కాంగ్రెస్‌కు ఓట మి భయం పట్టుకున్నది.
నేడే కౌంటింగ్..
మహబూబ్‌నగర్ స్థానిక సం స్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఉ ప ఎన్నిక కౌంటింగ్ ఆదివారం జ రగనున్నది. ఎన్నికల కమిషన్ ని బంధనల మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం కలెక్టర్ రవినాయక్ పాలమూరులోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఉ దయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభంకానున్నది. సిబ్బం ది ఉదయం 6:30 గంటలకు కౌంటింగ్ కేంద్రంలో రిపోర్టు చేయాల్సి ఉన్నది. టేబుల్స్ వద్ద కేటాయింపు చేసిన కౌంటింగ్ సిబ్బంది లెక్కింపు చేపడతారు. ఉదయం 7:30 గంటలకు స్ట్రాంగ్‌రూం తెరిచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్‌హాల్‌కు తీసుకెళ్లనున్నారు. మొత్తం ఓట్లను లెక్కించి కట్టలు కడతారు. ఆ తర్వాత లెక్కింపు చేపడతారు. పోలైన ఓట్లకు.. బ్యాలెట్ బాక్స్‌లో ఉన్న పత్రాలను సరిచూసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానున్నది.
ప్రాధాన్యతా క్రమంలో లెక్కింపు..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యతా క్రమంలో ఓటర్లు ఓటేస్తారు. అందుకే కౌంటింగ్‌లో భాగంగా మొదట ప్రారంభ లెక్కింపు చేపడుతారు. కౌంటింగ్ కోసం ఐదు టేబుళ్లను ఏ ర్పాటు చేశారు. ప్రారంభం లెక్కింపులో మొత్తం 10 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను, వచ్చిన బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తారు. అనంతరం మొత్తం చెల్లుబాటైన ఓట్ల సంఖ్య ఆధారంగా గెలుపు కోసం కావాల్సిన కోటాను నిర్ధారిస్తారు. అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొ దటి ప్రాధాన్యత ప్రకారం ప్రతి అభ్యర్థి సాధించిన ఓట్లను లె క్కించి, మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఎవరైనా అభ్యర్థి కోటాకు సరిపడా ఓట్లను సాధిస్తే అభ్యర్థి గెలుపొందినట్లుగా ప్రకటిస్తారు.
ఏ అభ్యర్థి కోటాకు కావాల్సిన ఓట్లు రాకుంటే ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టి తదుపరి ప్రాధాన్యత క్రమం ఆధారంగా ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ ఏదేని అభ్యర్థి కోటాను సాధించేవరకు చేపడతారు. ఏ అభ్యర్థికీ కోటా రానట్లయితే చివరికి మిగిలిన అభ్యర్థి గెలుపొందినట్లుగా ప్రకటిస్తారు. శాసనమండలి ఉపఎన్నిక కాంగ్రెస్‌కు పరీక్షగా మారింది. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత వచ్చిన తొలి ఎన్నిక కావడంతో అందులో సీఎం సొంత జిల్లా కావడం ఆ పార్టీకి సవాల్‌గా మారిందని చెప్పొచ్చు. అయితే స్థానిక ప్రజాప్రతినిధుల సంఖ్యాబలంలో మాత్రం కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్కే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే ఉద్దేశంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార ప క్షం మొత్తం స్థానిక ప్రజాప్రతినిధులను ప్రలోభపట్టే కార్యక్రమంలో మునిగిపోయిందన్న సమాచారం. దీనికి తగ్గట్టు ఆ పార్టీ ప్రముఖ వ్యాపారవేత్తను అభ్యర్థిగా ప్రకటించింది. రూ. కోట్లు ఖర్చు పెట్టయినా ఎమ్మెల్సీగా గెలవాలన్న లక్ష్యంతో పని చేశారన్న విమర్శలున్నాయి. ఆ పార్టీ క్యాండిడేట్ స్థానిక ప్రజాప్రతినిధులను ఇతర రాష్ర్టాల్లో విహారయాత్రలకు తీసుకెళ్లి రూ.లక్షల ఖర్చు పెట్టినట్లు తెలిసింది. కాగా, ఉన్న ఓట్లలో చా లామంది క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. దీంతో ఆ పార్టీకి గెలుపుపై అవకాశాలు సన్నగిల్లాయి. చివరివరకు ప్రయత్నాలు చే సినా ఏం జరుగుతుందో కౌంటింగ్ తర్వాతే తేలనున్నది.
బీఆర్ఎస్ గెలిస్తే రాజకీయాల్లో మలుపు
మహబూబ్‌నగర్ శాసనమండలి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్‌రెడ్డి గెలిస్తే రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం పడనున్నది. సీఎం సొంత జిల్లాలో బలమైన అభ్యర్థిని ఓడించిన ఘనత గులాబీ పార్టీకే దక్కుతుంది. అధికారం కోల్పోయి.. కొన్నాళ్లకు అదే పార్టీ నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేసే ఎన్నిక కావడంతో గ్రామస్థాయిలో ప్రభావం పడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం.. ఇతర కారణాలతో కాంగ్రెస్ ఓడిపోతే రాజకీయాలు మలుపు తిరిగే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే అదునుగా సీఎం పీఠం కదిలి అభ్య ర్థి మారినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

