సమయపాలన పాటించాల్సిందే..
తల్లి ఇన్‌కం ట్యాక్స్ శాఖలో, తండ్రి రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. తాతల కాలం నుంచి ఆ ఇంట్లో ఉద్యోగాల పరంపర కొనసాగుతూ వస్తున్నది. తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావడంతో వారినే ఆదర్శంగా తీసుకున్న ఆదర్శ్ సురభి కష్టపడి చదివి కలెక్టర్‌గా ఎంపికయ్యాడు.
- ప్రతి ఉద్యోగి టైంకు హాజరుకావాలి
- విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తా
- ప్రభుత్వ కార్యక్రమాలు పక్కాగా అమలు చేస్తాం
- జిల్లా అభివృద్ధికి సమన్వయంతో ముందుకెళ్తాం
- ఓటమి స్ఫూర్తితో ముందుకెళ్తే గెలుపు తథ్యం
- ‘నమస్తే తెలంగాణ’తో వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
తల్లి ఇన్‌కం ట్యాక్స్ శాఖలో, తండ్రి రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. తాతల కాలం నుంచి ఆ ఇంట్లో ఉద్యోగాల పరంపర కొనసాగుతూ వస్తున్నది. తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావడంతో వారినే ఆదర్శంగా తీసుకున్న ఆదర్శ్ సురభి కష్టపడి చదివి కలెక్టర్‌గా ఎంపికయ్యాడు. ఖమ్మం మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించి వనపర్తికి కలెక్టర్‌గా వచ్చిన ఆదర్శ్ సురభిని ‘నమస్తే తెలంగాణ’ పలకరించింది.
నమస్తే తెలంగాణ : మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకొని కలెక్టర్‌గా ఎదిగారు?
కలెక్టర్ : మా అమ్మ, నాన్నలే నాకు అదర్శం. అమ్మ నర్సమ్మ ఇన్‌కం ట్యాక్స్ శాఖలో చీఫ్ కమిషనర్‌గా మే 13న రిటైర్డ్ అయ్యారు. అలాగే నాన్న సురభి సత్తయ్య కామారెడ్డి జాయింట్ కలెక్టర్‌గా 2018లో ఉద్యోగ విరమణ పొందారు. నాకు ఒక తమ్ముడు అభిలాష్ సురభి, రేడియాలజిస్ట్లో ఎండీ చేస్తున్నారు. నేను కలెక్టర్ కావడానికి మా అమ్మ, నాన్నలే మార్గదర్శకం.
విద్యాభ్యాసం ఎక్కడ చేశారు?
నా విద్యాభ్యాసం ఎక్కువగా ఢిల్లీలోనే. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఢిల్లీలోనే చదివా. ఐఐటీ కూడా అక్కడే చేశాను. అమ్మ ఉద్యోగ రీత్యా ఢిల్లీలోనే ఉండడంతో అక్కడే నా చదువు సాగింది. ఐఏఎస్ కోచింగ్ కూడా అక్కడే తీసుకున్నా. కానీ.. ఫస్ట్ టైం రాలేదు. రెండో ప్రయత్నంలో సాధించాను..
మీ సొంతూరి వివరాలు చెబుతారా?
అమ్మది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వద్దనున్న చెన్నూరు గ్రామం. నాన్నదేమో కరీంనగర్. నేను ఎక్కువగా ఢిల్లీలో ఉన్నప్పటికీ నా స్వస్థలం ఎక్కడని అడిగితే హైదరాబాద్ అనే చెబుతాను.
కలెక్టర్‌గా వచ్చినందుకు ఎలా ఫీలవుతున్నారు?
చాలా సంతోషంగా ఉంది. జిల్లా ప్రజలకు మంచి చేయాలన్న తపన ఉంది. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తా. అధికారులు, ఉద్యోగులను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండేలా చూస్తాను.
మీరు ప్రధానంగా ఏ రంగాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నారు?
విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టితో ముందుకెళ్తాం. ఇప్పుడే విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ప్రభుత్వం కూడా అన్ని బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నది. మెరుగైన విద్య వల్ల గట్టి పునాది ఏర్పడుతుంది. అలాగే వర్షాకాలం ప్రారంభమైనందున ముందస్తుగా వ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్యశాఖ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. వీటితోపాటు ఇతర శాఖలపై సమీక్షలు నిర్వహించి త్వరలోనే జిల్లాపై ఓ అవగాహనకు వచ్చేస్తా. ప్రజా సమస్యలను ప్రామాణికంగా తీసుకుంటాం.
ఉద్యోగులకు ఏమైనా సూచనలు ఇవ్వాలనుకుంటున్నారా?
ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతగా వ్యవహరించాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సమయపాలన పాటించాలి. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. సర్కారు కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉంటుంది.
యూత్‌కు మీరిచ్చే సందేశం?
యువత ఓటమిని తట్టుకోగలగాలి. ఓటమిని స్ఫూర్తిగా తీసుకుంటేనే గెలుపు సాధ్యం. కార్యాలయ గుమాస్తా నుంచి కలెక్టర్ ఉద్యోగం వరకు ప్రణాళికతో ముందుకు సాగితే చాలా సు లభం. కేవలం 5 లేదా 6 గంటలపాటు క్రమపద్ధతిలో ప్రాక్టీస్ ఉంటే సరిపోతుంది. అనవసరమైన వాటికి దూ రంగా అవసరమై న వాటికి దగ్గర గా ఉంటే చా లు.. అనుకున్నది సులభంగా సాధించొచ్చు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

