ప్రతి పౌరుడికి ముఖ్యమైన ఓటు హక్కును కాపాడు కోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కొంచెం ఏమరపాటు చేశారో.. మీ ఓటు గల్లంతయ్యే ప్రమాదం నెలకొన్నట్లు సర్(ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ) హెచ్చరిస్తున్నది. మన ఓటు భద్రంగా ఉండాలంటే విధిగా ఎన్యుమరేషన్ ఫారం పూర్తి చేసి సకాలంలో అందించాల్సి ఉన్నది. అప్పుడే మీ ఓటు భద్రంగా భద్రంగా ఉండనున్నది. లేదంటే ఓటును కోల్పోయే అవకాశాలు చాలా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా తప్పులు లేని ఓటరు జాబితా రూప కల్పన పేరుతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.. దీంతో మ్యాపింగ్ ప్రక్రియ కీలకంగా మారింది.
– కొల్లాపూర్, జూన్ 23
మీరు దశాబ్దాలుగా ఓటు వేస్తున్నా రా..? ఇంకా మా ఓటును ఎవరూ చోరీ చేయలేరు అనే ధీమాలో ఉన్నారా..? అయినా సరే ఇప్పుడు అలసత్వం వహి స్తే మీ ఓటు హక్కు గాల్లో దీపమే అవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం సాగుతున్న సర్ (ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ-సర్వే, మ్యాపింగ్) ప్రక్రియ అత్యంత కీలకంగా మారింది. స్థానిక సంస్థ ల ఎన్నికల వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా క్రమద్ధీకరణ అంతా 2002 నాటి ఓటర్ లిస్ట్ అధిరంగానే జరుగుతో ంది. ఈ నేపథ్యంలో అసలు మ్యాపింగ్ అంటే ఏమిటి..? ఎవరికి ఏ మ్యాపింగ్ వర్తిస్తుంది..? ముఖ్యంగా పళ్లై అత్తగారింటికి వచ్చిన మహిళలు, కొత్త గా ఓటు హక్కు పొందిన యువత ఏం చేయాలి..? అన్న వివరాలతో ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
నిర్లక్ష్యం వహిస్తే ఓటు హక్కు గోవిందా..
ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో మన ఆయు ధం. ఈ సర్ మ్యాపింగ్ ప్రక్రియ కేవలం ప్రభుత్వ సర్వే మాత్రమే కాదు, మీ భవిష్యత్ రాజకీయ, సం క్షేమ హక్కులను నిర్ణయించే ప్రాధాన్యత గల అం శం. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ర్టాల్లో సర్‌తో లక్షలాది ఓట్లు గల్లంతయ్యాయి. ఈ అనుభవాన్ని దృష్టి లో పెట్టుకొని తక్షణమే మీ గ్రామ లేదా వార్డు బీఎల్వోను కలసి మీ ఓటును భద్రం చేసుకోవాలి.
మూడు రకాల మ్యాపింగ్‌లు
సర్ ప్రక్రియలో మూడు రకాల మ్యాపింగ్‌లు ఉన్నాయి. మీ ప్రస్తుత నివాసాన్ని బట్టి మీరు ఏ కేటగిరీలోకి వస్తారో ముందుగా తెలుసుకోవాలి.
1) సెల్ఫ్ మ్యాపింగ్ :
2002 సర్ ఓటరు లిస్ట్‌లో మీ పేరు ఉండి ప్రస్తుత 2025 ఓటరు లిస్ట్‌లో పేరు ఉన్నవారు నేరుగా బీఎ ల్వో వద్దకు వెళ్లి సెల్ప్ మ్యాపింగ్ చేయమని కోరాలి. 2002 ఒక చోట నివాసం ఉండి 2025 మరో చోట నివాసం ఉన్న వారు ఖచ్చితంగా సెల్ఫ్ మ్యాపింగ్ చేయించుకోవాలి. 2002 ఓటరు లిస్ట్‌లో పేరు ఉన్న దని ధీమా ప్రస్తుత నివాసం ఉన్న చోట కూడా ఓట రు లిస్ట్‌లో పేరు ఉన్నదని ధీమాగా ఉంటే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
2)యాడ్ ప్రోజెనీ :
2002లో మీకు ఓటు హక్కు వయస్సు 18ఏండ్లు రాకపోవడం వల్ల 2002 సర్ ఓటరు లిస్ట్‌లో పేరు ఉండదు. కానీ 2025 ఓటరు లిస్ట్‌లో ఓటు హక్కు ఉన్నది. తనకు 2002 సర్ ఓటర్ లిస్ట్‌లో పేరు లేదు కనుక తనకు వర్తించదు అనుకుంటే ప్రస్తుత మ్యాపింగ్ ఓటు హక్కు కోల్పోపోవడం ఖాయంగా కావొచ్చు. అందుకని ఇ ప్పటి ఓటరు లిస్ట్‌లో ఓటు ఉన్నా 2002 ఓటరు లిస్ట్‌లో రక్త సంబంధి కుల సీరియల్ నెంబర్ ఆధార ంగా యాడ్ ప్రోజెనీ చేయించాలి.
3) సెల్ఫ్ ప్రోజెనీ :
2002 నాటికే మీకు 18 ఏండ్లు నిండినా, ఏదైనా కారణంతో 2002 నాటి ఓ టరు లిస్ట్‌లో మీ పేరు లేకపోతే మీ పూర్వీకులైన తల్లి దండ్రులు, తాతల పేరు 2002 నాటి లిస్ట్‌లో ఉంటే, ఆ లింక్‌తో సెల్ఫ్ మ్యాపింగ్ చేయించుకోవాలి. .. సర్ ప్రమాదం నుంచి మీ ఓటు హక్కును కాపాడుకోవాలంటే తప్పనిసరిగా సెల్ఫ్ మ్యాపింగ్, యాడ్ ప్రోజెనీ, సెల్ఫ్ ప్రోజెనీల మూడింటిపై అవగాహన కలిగి ఉండాలి. ఈ మూడు కేటగిరీలలో మీరు ఏ కేటగిరి ద్వారా ఓటు హక్కును కాపాడు కునేందుకు అవకాశం ఉందో తెలుసుకోవాల్సి తక్షణ అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉంది.
స్వగ్రామాలకు రావాల్సిందే..
వ్యాపార, ఉద్యోగ, ఉపా ధి నిమిత్తం వలస వెళ్లిన వారు ఈ నెల రోజుల్లో వి ధిగా స్వగ్రామాలకు వచ్చి వివరాలందించాల్సి ఉంటు ంది. వీలు కాని వారు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల గడువులో వివరాలను వారే అధికారుల వద్దకు వెళ్లి అందించి జాబితాలో ఓటరుగా నమో దు చేయించుకొనే అవకాశముంది. తుది జాబితాను అక్టోబర్ 1వ తేదీన ప్రకటించనున్నారు. జూలై 25 నాటికి బీఎల్వోలు తమ పరిధిలోని ఓటర్ల పూర్తి వివరాలను అధికారులకు అందిస్తారు. అయితే సర్వే లో భాగంగా బీఎల్వోలు ప్రతి ఇంటిలోని ఓటర్లందరికీ రెండు ఎన్యుమరేషన్ ఫారా లు అందించి రసీదు తీసుకొంటారు.
అక్షరాస్యులైన ఓటర్లు ఆ ఫారాలను వారే స్వ యంగా పూర్తి చేసి ఒకటి బీఎల్వోలకు అందించి.. రెండోది తమ దగ్గర పెట్టుకోవాలి. దీనికి నెల రోజుల గడువు ఉం టుంది. బీఎల్వోలు వెళ్లిన ఏదైనా ఇంటికి తాళం వేసి ఉంటే ఆ ఇంటిని నెల రోజుల్లో మూడు సార్లు విధిగా సందర్శించాల్సి ఉం టుంది. ప్రతి పది మంది బీఎల్వోల పనితీరును పర్యవేక్షించేదుకు సూపర్వైజర్ను నియమించారు. వీరిని ఆయా మండల తాసీల్దార్లు నిత్యం పర్యవేక్షిస్తారు. పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్ (2,64,235 మంది ఓటర్లు), జడ్చర్ల (2,25,911 మంది ఓటర్లు), దేవరకద్ర (2,42,342 మంది ఓటర్లు) నియోజకవర్గాల్లో 17 మండలాలు ఉండగా.. 7,32, 488 మంది ఓటర్లు ఉన్నారు. బీఎల్వోల సంఖ్య 846 ఉండగా.. 83 మంది సూపర్వైజర్లను నియమించారు.
ఒక వ్యక్తికి ఒకే ఓటు
దేశంలో ఎక్కడ ఉన్న ఒక వ్యక్తికి ఒకే ఓటు నినాద ంతో సర్ ప్రోగ్రాం కార్యక్ర మం రూపుదిద్దుకుంది. ప్ర తి ఓటరుకు ఓటు హక్కుపై బాధ్యత పెంచుతోంది. అయితే సర్ మ్యాపింగ్‌తో ఓటు హక్కును కోల్పోకుండా ఓటర్లు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఓటరుకు ఒకే చోట ఓటు హక్కు కల్పించబడుతోంది. ఈ క్రమంలో అర్హత కలిగిన నిజమైన ఓటును కూడా కోల్పోయే ప్రమా దం ఉన్నది. అందుకే ప్రతి ఓటరు స్థానిక బీఎల్ వోను సంప్రదించి సర్ ఓటరు లిస్ట్‌ను తనిఖీ చేసు కోవాలి. ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉంటే వెంటనే ఓటు మ్యాపింగ్ కోసం బీఎల్వో అడిగిన డ్యాకుమెంట్స్ను అందించాలి.
– శ్రీకాంత్, కొల్లాపూర్ సర్ ప్రోగాం ట్రైనర్
పుట్టింటి లింక్‌తోనే అత్తగారింటి ఓటు భద్రం
2002 తర్వాత వివాహమై పుట్టిన ఊరు వదిలి, అత్తగారి ఊరికి వచ్చి న ఆడవాళ్ల పేర్లు ప్రస్తుతం వారి ఊరి 2002 లిస్ట్‌లో ఉండవు. మ రి వారికి ఓటు హక్కు పోకుండా ఉండాలంటే.. మీరు పుట్టిన ఊరిలోని 2002 ఓటరు లిస్ట్‌లో తల్లిదండ్రుల పేరు వారి సీరియల్ నె ంబర్ తెలుసుకోవాలి. ఆ సీరియ ల్ నెంబర్‌ను తీసుకొని మీరు ప్ర స్తుతం నివాసం ఉంటున్న ఊరిలోని బూత్ లెవల్ ఆఫీసర్‌కు ఇ వ్వాలి. సీరియల్ నెంబర్ ఆధారం గా బీఎల్వో మిమ్మల్ని ప్రస్తుత ఊ రి ఓటరు లిస్ట్‌లోకి మ్యాపింగ్ చేసి, మీ ఓటును సురక్షితం చేస్తారు.
లిస్ట్ ఎక్కడ దొరుకుతుంది?
2002 నాటి ఓటరు లిస్టులను ప్ర భుత్వం ప్రతి తాసీల్దార్ కార్యాలయం నుంచి గ్రామాల్లోని బీఎల్వోలకు పంపిణీ చేసింది. మీ పుట్టిన ఊరు లేదా ప్రస్తుత ఊరి బీఎల్వో ను కలిస్తే ఈ లిస్ట్ లభిస్తోంది. 2002 నాటి ఓ టరు లిస్ట్ చాలా కీల ంగా మారింది. అందుకని ప్రతిఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా ఉండాలంటే 2002 ఓటరు లిస్ట్‌లోని తల్లిదండ్రుల ఓటరు సీరియల్ నెంబర్ తీసుకోవాలనే విషయం మర్చిపోవద్దు.