వరి సాగులో నారుమడి కీలకం
వరి సాగులో నారుమడి యాజమాన్యం కీలకమైనది. నారు బాగుంటేనే పంట బాగుంటుంది. విత్తనాల ఎంపిక నుంచి నారుమడి దశ వరకు జాగ్రత్తలు తీసుకుంటే ఆపైన తెగుళ్ల బెడద, ఇతర సమస్యలు దరిచేరవని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
- విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి
- విత్తనశుద్ధితో అధిక దిగుబడికి అవకాశం
వరి సాగులో నారుమడి యాజమాన్యం కీలకమైనది. నారు బాగుంటేనే పంట బాగుంటుంది. విత్తనాల ఎంపిక నుంచి నారుమడి దశ వరకు జాగ్రత్తలు తీసుకుంటే ఆపైన తెగుళ్ల బెడద, ఇతర సమస్యలు దరిచేరవని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
– మక్తల్, జూన్ 30
నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
నీటి వసతి, ప్రాంతాన్ని బట్టి చీడపీడలను తట్టుకునే వరి విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలి. ఆరోగ్యవంతమైన పొలం నుంచి సేకరించిన వడ్ల గింజలను వాడాలి. ఎంపిక చేసిన రకాల కాలపరిమితిని బట్టి నిర్ణీత సమయంలో నారు వేసుకోవాలి, దీర్ఘకాలిక రకాలు 140రోజుల కన్నా ఎకువ, జూన్ 20 వరకు మధ్య స్వల్పకాలిక రకాలు. అలాగే 110 నుం చి 135 రోజులు, జులై 15 వరకు స్వల్పకాలిక రకాలు. జూలై చివరి వరకు నారు పోసుకోవచ్చు. ఎకరాల వరి సాగుకు సన్నరకం 20 కిలోల వాడాలి, దొడ్డురకానికి 25కిలోలు వాడాలి. నాటేముందు మొలక శాతాన్ని పరీక్షించుకొని నీరుపెట్టేందుకు, వదిలేయడానికి వీలుగా కాల్వలతో కూడిన ఎతె్తైన నారుమడులు చేసుకోవాలి. వరి విత్తనాలు నానబెట్టడానికి వాడే గోనె సంచి కొంచెం పెద్దగా ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే తేజమైన మొలక వస్తుంది. నారుమడి దున్నేటప్పుడు 250 కిలోల పశువుల ఎరువు ప్రతి రెండు గుంటలకు వేయాలి. విత్తనశుద్ధి విధిగా చేసుకోవాలి.
వరి విత్తనశుద్ధికి కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బెండజిమ్ కలిపి 24గంటల తర్వాత చల్లాలి. రెండు గుం టల నారమడిలో రెండు కిలోల నత్రజని, కిలో భాస్వరం, కిలో పొటాష్ ఇచ్చే ఎరువులను విత్తేముందు సగంవిత్తిన 15రోజులకు సగంవేయాలి. భాస్వ రం, పొటాష్ విత్తే ముందు వేయాలి. దుంపనార మడికైతే లీటర్ నీటిలో కిలోవిత్తనానికి ఒక గ్రాము కార్బెండిజం, లీటర్ మొలక కట్టిన విత్తనాన్ని నారుమడిలో పలుచగా సమానంగా చల్లాలి. చి కగా అలిపిన నారు సన్నగా పెరగడంతో నాటే సమయం లో ఒకే కుదురుకు 5.6 మొకలు పెట్టే అవకాశం ఉం టుంది. నారుమడి చుట్టూ గట్ల మీద చీడపీడలకు ఆశ్రయం ఇచ్చే తుంగ, చిప్పెర, గరిక ఊసలం వంటి కలుపు మొక లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అగ్గితెగులు బ్యాక్టీరి యా, ఆకు ఎండు తెగులు నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నారుమడిలో నారు తీయడానికి వారం ముందు రెండు గుంటల నారుమడికి 800 గ్రాములు కర్చో క్యురాన్ గుళికలు ఇసుకలో కలిపి చల్లి, పల్చగా నీరు పెట్టాలి. త ద్వారా ఉల్లి కోడు కాండం తొలిచూపును నివారించవచ్చు. పూర్తిస్థాయిలో నారుమడిలో సస్యరక్షణను పాటించినట్లయి తే వరి సాగులో అనుకున్న రీతిలో దిగుమతి పొందేందుకు రైతులకు అవకాశం ఉంటుంది.
దిగుబడిలో నారుమడి కీలకం
రైతులు ఖరీఫ్‌లో వరి సాగు చేసుకునేందుకు సస్యరక్షణ చర్య లు, నారుమడి పంపకం గురిం చి ముందుగానే తెలుసుకోవాలి. మేలైన గింజలను ఎంపిక చేసుకోవాలి. వాటిని ఒకరోజు నానబెట్టి చల్లినట్లయితే అనుకున్న రీతిలో మొలక వస్తుంది. నారుమడిలో ఎకువ స్థాయిలో నీరు ఉంచకుండగా మొలకకు కావలసినంతనే పెట్టాలి. అవసరమైన క్రిమిసంహారక మందులు వాడితే వరి దిగుబడి బాగా వస్తుంది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

