మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మార్చి 28 : మున్సిపల్, కార్పొరేషన్ సాధారణ ఎన్నికల అనంతరం మొదటిసారిగా శనివారం నిర్వహించిన మహబూబ్‌నగర్ నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా ముగిసింది. ఉదయం 11గంటలకు ప్రారంభించాల్సిన సమావేశం 11:55గంటలకు ప్రారంభమైంది.
మేయర్ గుమాల్ మమత అధ్యక్షతన కమిషనర్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మొదటి కౌన్సిల్ సమావేశం సందర్భంగా మేయర్ గుమాల్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డిని బీఆర్ఎస్ కార్పొరేటర్లు శాలువాలతో సన్మానించారు. అనంతరం కార్పొరేషన్ అధికారు లు అజెండాను చదివి వినిపించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ అంచనా బడ్జెట్ ప్రతిపాదనలను మేయర్ ప్రవేశపెట్టగా కౌన్సిల్ ఆమోదించింది.
సమావేశంలో మేయర్ పక్కన డిప్యూటీ మేయర్‌కు కుర్చీ కేటాయించడాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు తప్పుపడుతూ స మావేశంలోనే నిరసన వ్యక్తం చేశారు. కరీంనగర్, వరంగల్‌లో జరుగుతున్న తీరు ఇక్కడ ఎందు కు అమలు చేయడం లేదని నిలదీశారు. నగర పాలక సంస్థ పరిధిలో బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా బడ్జెట్, కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించారు. అయ్యా ఇది చట్టంలో ఉందా..? లేదా ఒక్క మహబూబ్‌నగర్‌లోనే వర్తిస్తుందా.? అని ప్రశ్నిస్తూ మున్సిపల్ కమిషనర్‌ను నిలదీశారు. కరీంనగర్, వరంగల్ నగర పాలక సంస్థలు కావా.? అవునా.? వీటికి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
మున్సిపాలిటీకి, కార్పొరేషన్ల్కు ఒకటేయాక్టు ఉందా.? లేదా.? అనేది తెలుసుకోవాలని, వాస్తవంగా తెలియదని, సెపరేట్ సీటింగ్ కావాలంటే ఈ హాల్ సరిపోదన్నారు. ఎవరో ఏదో చెప్పారని వాళ్లు వచ్చి ఇలా చేస్తావున్నారని అన్నారు. కమిషనర్ రామాంజులరెడ్డి నిబంధనల మేరకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మున్సిపల్, నగర పాలక సంస్థ యాక్టులో మేయర్ అనుమతి మేరకు ఎవరికైనా కుర్చీ వేసే అవకాశం ఉంటుందని, డిప్యూటీ మేయర్‌కు కుర్చీ వేయవద్దనే నిబంధన లేదని పేర్కొన్నారు. మేయర్ అనుమతి ఉంటే కూర్చొని మాట్లాడొచ్చు. మేయర్‌కు ఆ అధికారం ఉందన్నారు. రూల్ పొజిషన్‌కు అనుగుణంగానే వెళ్దామని డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి అన్నారు.
కరీంనగర్ పాపులేషన్, మహబూబ్‌నగర్ పాపులేషన్ ఒకేలా ఉ న్నాయి. రెండు నగర పాలక సంస్థ లే.. కానీ ఇక్కడ బీసీ మహిళ మేయర్ కావడంతోనే ఇలా చేస్తున్నారు. రూల్‌కు విరుద్ధంగా డిప్యూ టీ మేయర్‌ను, ఇతరులను కూర్చోబెడుతున్నారు. ఇది మేయర్‌ను అగౌరవ పర్చడమే.! మేయర్ ఒక్కరూ కూర్చోవాలా .. నగర పాలక సంస్థ ప్రథమ పౌరురాలిగా ఆమెనే కూర్చోవాలా.! ఆమెనే సమాధానం ఇవ్వాలి.. ఆమెను ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లమంతా 16మందిమి సపోర్టు చేశాం. ఎమ్మెల్యే కుర్చీలు లేవు.. అందుకే కూర్చోబెట్టామంటే ఎట్లా.. ? – జ్యోతి, బీఆర్ఎస్ కార్పొరేటర్
పట్టణ ప్రగతి ప్రోగ్రాంలో మేయ ర్ మా వార్డు విజిట్ చేసింది. అక్క డా ప్రోటోకాల్ లేదు.. ఏఈ, డీఈ ఎవరూ లేరు.. ఈ సభలో మేయర్ మాత్రమే కూర్చోనివ్వాలని కోరితే హాల్ సరిపోదని అనడం విడ్డూరం గా ఉంది.. మేయర్ అయిన మహిళకు అగౌరవ పర్చడం సరికాదు.. మేయర్ చెప్పారు కూర్చోబెట్టామని కమిషనర్ చెబుతున్నారు.. ఇది మేయర్, కమిషనర్, ఎమ్మెల్యే అని కాదు.. రూల్ ప్రకారం చట్టానికి అనుగుణంగా ముందుకు సాగాలి.. మేయర్ అభీష్టానికి అనుగుణంగా అం టే.. పార్టీ లేదా క్యాంప్ కార్యాలయం, కూర్చోబెట్టవచ్చు.. ఇక్క డ రూల్స్ పాటించాల్సిందే. – కిశోర్, బీఆర్ఎస్ కార్పొరేటర్
బీసీ మహిళను అగౌరవ పర్చకుండా తనను ఒక్కదాన్ని కూర్చోబెట్టి.. మిగిలిన వాటికి రూల్స్‌కు అనుగుణంగా ముందుకు వెళ్లాలి.. లేదు డిప్యూటీ మేయర్‌కు కుర్చీ వేయాలని ఉందంటే అందుకు సంబంధించిన జీవో కాపీ చూపా లి.. అది లేదు.. ఇదీ లేదు.. మాటలతోనే అన్నీ ఉన్నాయంటూ దాటవేత ధోరణి అవలంభిస్తున్నారు. ఇదెక్కడి పద్ధతి.. నిబంధనల మేరకు కౌన్సిల్ సమావేశం కొనసాగించాలని కోరుతున్నాం. మేయర్ అభీష్టానికి అనుగుణంగా అనుకుంటే అది వాళ్ల ఇంటి వద్ద చూసుకోమనండి ఇక్కడ కాదు.
– నవకాంత్, బీఆర్ఎస్ కార్పొరేటర్