బతుకమ్మ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఊరూరా.. చీరల సంబురం మొదలైంది. 25 రంగులు.. 600 డిజైన్లలో ఆడపడుచులకు సర్కారు సారెగా అందిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 9.66 లక్షల
పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. గోదాంల నుంచి గ్రామాలు.. పట్టణాలకు చేరాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందజేశారు. చీరలు అందుకున్న మహిళలు వాటిని చూసి మురిసిపోతున్నారు.
– వనపర్తి, అక్టోబర్ 5
వనపర్తి, అక్టోబర్ 5 : నాలుగేండ్లుగా ఆడపడుచులకు దసరా, బతుకమ్మ పండుగల కానుకగా బతుకమ్మ చీరలను ఉచితంగా సర్కారు సారె అం దిస్తున్నది. ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను ప్రతియేటా ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వైభవంగా ని ర్వహిస్తున్నది. తొమ్మిది రోజుల్లో ప్రతిరోజూ బతుకమ్మను రోజుకో పూలపేరుతో పండుగను చేసుకుంటారు. ఈ ఏడాది ఐదో విడుత కింద అందజేసే బతుకమ్మ చీరలు జిల్లాకు చేరుకున్నాయి. వనపర్తి జిల్లాలో 18ఏండ్లు పైబడిన ఉన్న మహిళలకు ఈ చీరలను అందజేస్తారు. జిల్లాలో మొత్తం 1.83లక్షల మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే జిల్లాకు 100శాతం చీరలు చేరుకున్నాయి. జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్ యార్డులో గల గౌడన్లలో బతుకమ్మ చీరలను భద్రపరిచారు. వాటిని ఈనెల 4వ తేదీ నుంచి జిల్లాలోని మహిళలకు ఎక్కడిక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు అందజేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను ప్రత్యేక శ్రద్ధతో ఈ ఏడాది 25 రంగుల్లో, 600 డిజైన్లలో తయారు చేయించింది. గతంలో ఒక బెండ్లో ఒకే రకంగా వచ్చేవి. ఈసారి ఒక బెండలో మల్టీపుల్ కలర్స్‌తో వచ్చాయి. ఈ ఏడాది మరింత నాణ్యత,పట్టు చీర మాదిరిగా డిజైన్ చేయబడింది.
జిల్లాలోని 324 రేషన్ దుకాణాల ద్వారా అక్టోబర్ 4వ తేదీ నుంచి కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ ఆదేశాల మేరకు బతకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కలెక్టర్ జిల్లాలోని ఆయా మండలాల తాసీల్దార్లతో సమావేశమై సూచనలు, సలహాలు చేశారు. పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలోని 14 మండలాలు, రెండు మున్సిపాలిటీల్లోని మహిళలకు పంపిణీ చేసేందుకు 1.83 లక్షల చీరలు అవసరమని అధికారులు అంచనా వేశారు. మండలాల వారీగా అమరిచింతకు 9,731, ఆత్మకూర్‌కు 11,837, చిన్నంబావి 9,166, ఘణపురం 12,454, గోపాల్పేట 12,741, కొత్తకోట 18,953, మదనాపురం 9,228, పాన్‌గల్ 15,224, పెబ్బేర్ 16,637, పెద్దమందడి 12,448, రేవల్లి 7,140, శ్రీరంగాపురం 6,362, వీపనగండ్ల 8,833, వనపర్తి 32,245 చీరలు అందించనున్నారు.
జిల్లాకు కావాల్సిన 1.83లక్షల చీరలు ఇప్పటికే జిల్లాకు చేరాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి మండలాన్ని కేటాయించిన కోటాను ఆయా జిల్లాలకు పంపించేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఈ ఏడాది బతుకమ్మ చీరలు అద్భుతంగా ఉన్నాయి. చీరలు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకున్నాం. ఈ నెల 4వతేదీన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా మహిళలకు అందజేశాం. జిల్లా వ్యాప్తంగా పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం.
– నర్సింహులు, డీఆర్డీవో, వనపర్తి