స్వచ్ఛతలో మేటి అయిజ
అయిజ మున్సిపాలిటీ స్వచ్ఛతలో మెరిసింది. మున్సిపల్ అధికారుల కృషి ఫలించి మేటిగా నిలిచింది. పారిశుధ్య నిర్వహణలో చేసిన కృషికి ఓడీఎఫ్ ఫ్లస్ ఫ్లస్ పట్టణంగా గుర్తింపు సాధించింది.
- పరిశుభ్రతలో అయిజ మున్సిపాలిటీ ముందంజ
- ఓడీఎఫ్ ఫ్లస్ ఫ్లస్ అవార్డుకు ఎంపిక
అయిజ, జనవరి 8 : అయిజ మున్సిపాలిటీ స్వచ్ఛతలో మెరిసింది. మున్సిపల్ అధికారుల కృషి ఫలించి మేటిగా నిలిచింది. పారిశుధ్య నిర్వహణలో చేసిన కృషికి ఓడీఎఫ్ ఫ్లస్ ఫ్లస్ పట్టణంగా గుర్తింపు సాధించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛభారత్ మిషన్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో బహిరంగ మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్ ఫ్లస్ ఫ్లస్) పట్టణంగా పురస్కారానికి ఎంపికైంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగం గా మున్సిపల్ అధికారులు ఇటీవల టాయిలెట్ క్లీన్ క్యాంపెయిన్ చేపట్టారు. బహిరంగ మల, మూత్ర విసర్జనతో కలిగే అనార్థాలపై అవగాహన కల్పించడంతోపాటు టాయిలెట్ల వినియోగంపై విస్తృతంగా ప్రచారం చేశారు.
దీంతో అయిజ ఓడీఎఫ్ ఫ్లస్ ఫ్లస్ అవార్డును దక్కించుకున్నది. అయితే అయిజ మున్సిపాలిటీకి స్వచ్ఛ పురస్కారం రావడం సంతోషకరమని మున్సిపల్ కమిషనర్ నిత్యానంద్ తెలిపారు. మున్సిపల్ చైర్మన్ దేవన్న, వైస్ చైర్మన్ నర్సింహులు, కౌన్సిలర్లు, పట్టణ ప్రజల సహకారంతో స్వచ్ఛ పురస్కారానికి అయిజ ఎంపికైందని పేర్కొన్నారు. స్వచ్ఛ మున్సిపాలిటీగా అయిజ పట్టణం ఎంపిక కావడంతో పట్టణ ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

