15వేల వడ్ల బస్తాలు చోరీ
వ్యవసాయశాఖ మార్కెట్ గో దాంలో నిల్వ ఉంచిన దాదాపు 15వేల వడ్ల బస్తాలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో చోటుచేసుకున్నది. వివరాలిలా..
- వ్యవసాయ శాఖ గోదాం నుంచి ఎత్తుకెళ్లిన దుండగులు
- వెల్దండ మండలం పెద్దాపూర్‌లో ఘటన
కల్వకుర్తి, ఏప్రిల్ 4 : వ్యవసాయశాఖ మార్కెట్ గో దాంలో నిల్వ ఉంచిన దాదాపు 15వేల వడ్ల బస్తాలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో చోటుచేసుకున్నది. వివరాలిలా.. వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో హైదరాబాద్-శ్రీశైలం హైవేకు కాస్త లోపలికి ఉన్న వ్యవసాయ శాఖ గోదాంలో పెద్ద ఎత్తున వడ్ల బస్తాలు చోరీకి గురికావడం సంచలనంగా మారింది. కల్వకుర్తి పట్టణానికి చెందిన జూలూరి రమేశ్‌బాబుకు స్థానికంగా సద్గురు రాఘవేంద్ర పారా బాయిల్డ్ మిల్లు ఉన్నది. సీఎమ్మార్‌లో భాగంగా కల్వకుర్తికి చెందిన సద్గురు రాఘవేంద్ర రైస్‌మిల్లు యజమానికి ప్రభుత్వం లక్షన్నర క్వింటాళ్ల ధాన్యాన్ని కేటాయించింది. కాగా రమేశ్‌బాబు పెద్దాపూర్ వద్ద వ్యవసాయ శాఖకు చెందిన గోదాంలో ధాన్యాన్ని నిల్వ చేశాడు. ఈక్రమంలో వ్యాపారి అద్దె చెల్లించడం లేదని మార్కెటింగ్‌శాఖ అధికారులు గోదాంకు తాళాలు వేశారు. సీఎమ్మార్‌కు సంబంధించిన ధాన్యాన్ని నిల్వ ఉంచిన గోదాంలకు అద్దె చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పిందని సదరు వ్యాపారి మార్కెట్ అధికారులకు చెప్పగా వారు జీవో కాపీలు చూపించాలని అడిగారు.
దీంతో వ్యాపారి చేసేదేమీలేక మిన్నకుండిపోయారు. ఇది జరిగి ఏడాది కావచ్చింది. ఈమధ్యకాలంలో వనపర్తి జిల్లా చిన్నంబావిలో ధాన్యం చోరీ జరిగిన ఘటనలో ఒక నిందితుడు పట్టుబడ్డాడు. అదేవిధంగా బల్మూరు, కోడేరు గ్రామాల్లోనూ ధాన్యం చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అనుమానం వచ్చిన మార్కెట్ అధికారులు పెద్దాపూర్ వద్ద ఉన్న గోదాంకు వెళ్లి చూడగా అప్పటికే షట్టర్లు తెరిచి ఉన్నాయి. వ్యాపారి రమేశ్‌బాబుకు సమాచారం అందించగా అతడు అక్కడికి చేరుకొని దాదాపు 15వేల బస్తాల ధాన్యం చోరీకి గురైనట్లు గుర్తించాడు. ఘటనపై రమేశ్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గోదాంలకు అద్దె చెల్లించకపోవడంతో, మార్కెటింగ్ శాఖ అధికారులు తాళాలు వేసిన సంగతి గుర్తించిన దుండగులు ఈ చోరీకి పాల్పడినట్లు చర్చించుకుంటున్నారు. దుండగులు చోరీ చేసిన ధాన్యాన్ని నాగర్‌కర్నూల్‌లో ఓ వ్యాపారికి విక్రయించినట్లు రైస్ మిల్లులకు చెందిన కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వడ్ల బస్తాల చోరీపై వ్యాపారి రమేశ్‌బాబు సివిల్ సైప్లె అధికారులకు ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పండుగ పూట..జర పైలం!
Palamuru Migration | నడిగడ్డ మళ్లీ వలసబాట..! సీఎం సొంత జిల్లాలో దారుణ పరిస్థితులు
KTR | బహిరంగ దోపిడీ.. కాంగ్రెస్ దోపిడీకి రాహులే కొత్త పదం చెప్పాలె
Mannе Krishank | మూడేండ్లకే ఆమె బిలియనీర్స్.. బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన వ్యాఖ్యలు
Revanth reddy | నీళ్లు లేవు.. పంటలు వేయొద్దు.. వేసి నష్టపోతే ఏం చేయలేం.. మీ ఖర్మ: సీఎం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

