మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస రెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అదే పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా శిక్షణ ఎస్ఐ తనపై శ్రీనివాస రెడ్డి లైంగిక దాడికి పాల్పడినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి బాధిత ట్రైనీ ఎస్ఐ వరంగల్ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించింది. నిన్న రాత్రి అడవిలోకి తీసుకెళ్లి తనపై ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని త్వరలో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించనున్నట్లు సమాచారం. విచారణ అనంతరం అతడిపై శాఖపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మహిళా ట్రైనీ ఎస్ఐపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తప్పవని వరంగల్ సీపీ తరుణ్ జోషీ పేర్కొన్నారు.