గొర్రెలకు కొమ్ములు మొలిచాయి
మేసేది గడ్డి పరకలే కదా తలొంచుకుని ఎంతదూరమైనా తోకలా వెంటబడి వస్తాయనే కాపరి గుడ్డి నమ్మకానికి తొలిసారి సవాలు ఎదురయింది
మేసేది గడ్డి పరకలే కదా
తలొంచుకుని ఎంతదూరమైనా
తోకలా వెంటబడి వస్తాయనే
కాపరి గుడ్డి నమ్మకానికి
తొలిసారి సవాలు ఎదురయింది
మంద మీద పడి దోచుకు తిన్న
తోడేళ్ళ ఆటలు ఇక సాగవని
కుటిల పన్నాగాలు పారవని
దోపిడీ జంతువులకు బోధపడింది
అణగి మణగి ఉంటాయనే అపోహతో
లేత పిల్లల ఆశలను తొక్కిపట్టిన
నిరంకుశ పాదాలకు నిప్పురవ్వలు
అంటించిన అమాయక జీవుల
ఐక్యతను చూసిన ఆధిపత్యము
నివ్వెరబోయి మడమ తిప్పింది
బక్క పలుచని గొర్రెల బలానికి
బలుపు వాపులు నీటి బుగ్గలాయే
కసాయిని నమ్మిన గొర్రెలు కావవి
కడుపుమంటతో తిరగబడిన
కాలాతీత శక్తిమయ ప్రాణులవి
వేటకుక్కలను వేటాడి చంపగల
ఆత్మ విశ్వాసం వాటికి వచ్చింది
అడవి రాజులనైనా ఎదిరిస్తామనే
తెగింపు అడుగులు పడ్డాయి ఇప్పుడు
కొండల చుట్టూ తిరుగుతూ
పచ్చి గడ్డి మెసే చిట్టి గొర్రెలు
కొండలనైనా పిండి చేసే స్థాయికి
ఎదిగాయి నేడు.
-దుర్గమ్ భైతి
99590 07914
Read Today's Latest Literature-more Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

