త్యాగ పరిమళం
అమ్మ చేత ఇత్తనం పట్టుకుంది. నాయిన నాగలికి బొట్టు పెట్టిండు.
అమ్మ
చేత ఇత్తనం పట్టుకుంది.
నాయిన
నాగలికి బొట్టు పెట్టిండు.
తుమ్మ సెట్టు మీద
పాలపిట్ట
సెలిమె అద్దంలో
తన రూపు చూసుకుంటుంది.
మంద గుడిసె మీద
గండు కోయిలలు
పోరు పాటలు వినిపిస్తున్నవి.
పుస్తకాలలోన
అచ్చరాలన్నీ
సకల జనుల సమ్మెకు
మద్దతు గట్టినయి
ఎత్తిన
బోనం దించకుండా
నల్ల పోశమ్మ నడూర్ల్య దీపం పెట్టింది.
పొల్మెర కాడ
గుండె డప్పు కొట్టుకుంట
కోటేశు కావడి కుండలు కట్టిండు.
ఇంటి ముందలి
జిల్లేడు సెట్లు
యిడుపు కాయితం రాసుకున్నయి
సోమిగాని గోశిగుడ్డ
అయ్యగారి పంచెకట్టు దూప తీర్చింది
తెలంగాణి శిగకొప్పున
బతుకమ్మ కొలువుదీరింది
అరవై ఏండ్ల
ముసలి తాత
ఈర తిలకం దిద్దుకున్నడు
తొవ్వపొంటి మోదుగు పూలు
త్యాగాలనే పరిమళిస్తున్నయి
– చిక్కొండ్ర రవి 95023 78992
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

