గురుభ్యో నమః

నేడు ఉపాధ్యాయ దినోత్సవం
రెండు చాక్‌పీస్ ముక్కలతో
అప్పుడప్పుడూ ఓ పుస్తకంతో
వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు
మా తరగతి గదిలోకి వస్తారు..
భూగోళం వారి తలల్లో ఉందో
సూర్యచంద్రులు వారి చేతుల్లో
ఉన్నారో తెలియదు గానీ
అంతులేని ఒక మహా ప్రపంచాన్ని
అలవోకగా మన ముందు పరుస్తారు..!
ఆకాశం బ్లాక్‌బోర్డ్‌పై
అక్షర నక్షత్రాలను మెరిపిస్తారు..!
మన కళ్ళల్లోని మెరుపు
చూడాలని కోరికతోనో ఏమో
రోల్ మోడల్స్ గానో..
రేర్ హీరోలుగానో తాము మారి
తమలో తాము ఎన్ని భరిస్తారో..
ఏమి సహిస్తారో వాళ్ళకే తెలుసు!
ఎక్కడెక్కడివో కనుక్కుని వచ్చీ..
కొనుక్కుని వచ్చీ..
మాకు అందించాలని చేసే ప్రయత్నంలో
వాళ్ళు అప్పుడప్పుడూ చిన్నపిల్లలై పోతారు!
తెల్లని కాన్వాస్ల్లాంటి మనస్సులపై
సుకుమారమైన సన్నని రేఖలతో
సప్తవర్ణాలు అద్ది అద్భుత చిత్రాలను గీస్తారు!
నిరాకృత బండరాళ్లయిన మమ్మల్ని
కఠిన క్రమశిక్షణా ఉలులతో చెక్కి
సౌందర్య శిల్పాలుగా మారుస్తారు
మేము చిత్రాలమైనా చిత్రకారులమైనా..
శిల్పాలమైనా శిల్పాచార్యులమైనా
మమ్మల్ని తీర్చిదిద్దినవారు
బ్రహ్మలు కాక మరేమవుతారు?
బిడియం వల్లనో భయం చేతనో
మేము మాట్లాడకపోయినా
అర్థం చేసుకుని అక్కున చేర్చుకున్నవారు
మనస్తత్వ శాస్త్రజ్ఞులు కాక ఇంకేమవుతారు?
మా చిన్ని బుర్రల్లోకి విషయం ఎక్కనిది
ఆకలి వల్లనా అజ్ఞానం వల్లనా అని
కనుక్కుని బోధించే వాళ్ళు
అమ్మలు కాక మరేమవుతారు?
చల్లని కాంతివంతమైన వెన్నెల
జగమంతా పరుచుకున్నట్టు
చివరి బెంచీ చిన్నారులకూ
సమజ్ఞానం అందించేవాళ్ళు
చక్కని చందమామలు కాక మరేమవుతారు?
భానుడు నిరంతరం జ్వలిస్తూ
ఆకాశానికి ఎన్నో ఉదయాల్ని బహూకరించినట్టు
నాలుగు గోడల తరగతిగదుల మధ్య శ్రమిస్తూ
నైపుణ్య దీప్తులను వేలమందిలో వెలిగించేవాళ్ళు
కోటి సూర్యులు గాక ఇంకేమౌతారు?
గురువులారా మీకు వందనం !
నా దోసిళ్ళతో మీ పాదాలకు ప్రణామం!!
నెల్లుట్ల రమాదేవి, 94406 22781
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

