పదేండ్ల తెలంగాణ ప్రకాశం..!
తెలంగాణొస్తే ఏమైతదనీ.. తెలంగాణొచ్చాక ఏమైందనీ.. ఏవేవో సూటిపోటు మాటలతో ఎగతాళి చేసితిరి కదా..!
తెలంగాణొస్తే ఏమైతదనీ..
తెలంగాణొచ్చాక ఏమైందనీ..
ఏవేవో సూటిపోటు మాటలతో
ఎగతాళి చేసితిరి కదా..!
రెండున్నర దశాబ్దాలుగా వింటూనే ఉన్నాం
కాలం గుండెకు
జై తెలంగాణ నినాదంతో
ఊపిరి పోస్తూనే ఉన్నాం..!
విప్లవానికి పర్యాయపదం కేసీఆర్ గళం
ఉద్యమానికి ఎవరెస్టు శిఖరం కేసీఆర్ బలం
రైతు చీకటి బ్రతుకు రాతలలో
రైతుబంధు నక్షత్రాల వెలుగొచ్చే..!
చీకటిని తరిమే స్ఫూర్తి శిఖలలో
వేడుకగా కోట్ల ఇంటికి కరెంటొచ్చే..!
బ్రతకడమే భారమైన ముసలోళ్ల
మోములో ‘ఆసరా‘ పున్నమి నవ్వొచ్చె..!
ఊరూరా పంటపొలాల గుండెలకు
వాగులు, చెరువుల గుండా
సెల్యూట్ చేసేలా నీళ్లొచ్చె..!
మతాల మధ్య మంటలు లేని
మత సామరస్యపు మానవీయ
గులాబీ జెండా వచ్చె..!
అన్నింటినీ మించి..
పేదోళ్ల పిల్లలకు గురుకులాల సాక్షిగా
కార్పొరేట్ ఇంగ్లిష్ సదువొచ్చె..!
మెడికల్ కాలేజీలకు ప్రాణం వచ్చె..!
పేదింటి ఆడపిల్లల లగ్గానికి కళ్యాణం
లక్ష కానుకగా ‘లక్ష్మి’ వచ్చె..!
భారతానికి తెలంగాణ భరోసానిచ్చె..!!
తెలంగాణ వచ్చాక
మన ప్రగతిపథం ఐరాసలో
ఎజెండాగా ఎక్కొచ్చె..!!
ఎంతని రాయాలి
ఏమని చెప్పాలి
అబద్ధాలు నిజాలు కావాలంటే
సాక్ష్యాలు కావాలి
సత్య ప్రతాపానికి సత్యముద్రికల
సంతకాలు చాలు..!
తెలంగాణ భావోద్వేగాల
ప్రభావ పాఠం కాదు
దశాబ్దాల బతుకు పోరాటాల
యుద్ధగీత సామ్రాజ్యం
ఫిజిక్స్ అరుణ్ కుమార్
9394749536
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

