(‘హైడ్రా’లో బతుకులు కూలిపోయిన పేదల తరపున..)అపరిచితంగా రాత్రి తోవ తప్పుడు అయినప్పుడు దూరంగా గుడిసె ముందున్న గూట్లోని నిరాడంబర మిణుకు దీపం
పరిచితంగా పాదాలను సరియైన తోవలోకి తెస్తుంది!
కంటి ముందు దేవదూత అవుతుంది!
దీపం చిన్నది అయితేనేం పెద్ద లైట్ హౌస్ కన్నా గొప్ప!
దీపం కాంతి దిక్సూచి!
-కందాళై రాఘవాచార్య
87905 93638