మట్టి పిల్ల!
పిల్ల తట్టతో మట్టి మోస్తూ అంతస్తులు అంతస్తులు అలసట లేకుండా అధిరోహిస్తోంది రెక్కలున్నట్టే! గంధర్వ కన్యలా పైపైకి ఎగిరిపోతున్నట్టుంది యానిమేషన్ కాదు నిజంగానే!
పిల్ల తట్టతో మట్టి మోస్తూ
అంతస్తులు అంతస్తులు అలసట లేకుండా అధిరోహిస్తోంది రెక్కలున్నట్టే!
గంధర్వ కన్యలా పైపైకి ఎగిరిపోతున్నట్టుంది
యానిమేషన్ కాదు నిజంగానే!
ముసలోల్లు, వయసోళ్లు, ఉన్నోల్లు, లేనోల్లు మట్టి పిల్లను ఆశ్చర్యంగా చూస్తున్నారు!
పనిమంతురాలు మరి!
ఒంటి నిండా ఎర్రమట్టి రాలి రంగోలి!
పిల్లవి చిరుగుల బట్టలైనా
నూనె లేని వెంట్రుకలైనా
మట్టి పిల్ల శ్రమ సౌందర్యంతో దేవకాంత లాగే ప్రత్యక్ష ప్రమాణం!
శ్రమ అందాన్ని గుర్తించిన వాడెవడైనా
ఈ ప్రపంచంలో గనక ఉంటే
స్వయంవరంగా మట్టి పిల్లను తప్పక లగ్గం చేసుకుని మట్టి పిల్లను మణిగా లోకోత్తరం చేస్తాడు!
ఆకాశం మట్టి పిల్లను తాకి ఇంద్రధనువు!
గాలి మట్టి పిల్లను తాకి సౌగంధికం!
అగ్ని నిలువెత్తు ఆమె తేజస్సే!
నీరు నీరంతా ఆమె స్వేద జలపాతం!
ఇక మట్టితో ఆమె పుట్టి పెట్టినట్టు భూదేవే!
మట్టి పిల్ల పేద కాదు
శ్రమ సౌందర్యంతో మూర్తీభవించిన విశ్వసుందరి
– కందాళై రాఘవాచార్య 87905 93638
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

